Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Bank Of Baroda

Updated on: Feb 22, 2023 | 9:23 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్విజిషన్‌ విభాగానికి సంబంధించిన పోస్టులకైతే 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 24 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 14, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు: 24
  • ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ పోస్టులు: 17
  • అక్విజిషన్‌ పోస్టులు: 505

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us