HQ Central Command Jobs 2022: ఇండియన్ ఆర్మీ-సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు..

ఇండియన్ ఆర్మీకి చెందిన సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్ (HQ Central command) దేశ వ్యాప్తంగా పలు కమాండ్‌ హాస్పిటల్లలో.. 43 గ్రూప్‌ - సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

HQ Central Command Jobs 2022: ఇండియన్ ఆర్మీ-సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రూప్‌ సీ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు..
Indian Army

Updated on: Jul 31, 2022 | 5:56 PM

Army HQ Central Command Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్ (HQ Central command) దేశ వ్యాప్తంగా పలు కమాండ్‌ హాస్పిటల్లలో.. 43 గ్రూప్‌ – సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 17 హెల్త్‌ ఇన్స్‌పెక్టర్‌, 26 వాషర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ కోర్సు సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. విద్యార్హతలతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జులై 30, 2022 నాటికి 15 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అసక్తి కలిగిన వారు నోటిఫికేషన్‌ వెలువడిన 45 రోజుల్లోపు (సెప్టెంబర్‌ 25, 2022) ఆఫ్‌లైన్‌ ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌ జులై 30న విడుదలైంది. అప్లికేషన్‌ ఫీజు తప్పనిసరిగా రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది.

అడ్రస్‌: Commandant, Command Hospital (Central command), Lucknow- 226002.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.