APVVP Kurnool Recruitment 2022: కర్నూలు ఏపీవీవీపీలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం.. టెన్త్‌/ఇంటర్‌ పాసైతే చాలు..

|

Jun 06, 2022 | 5:42 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Kurnool District).. ఒప్పంద ప్రాతిపదికన పోస్ట్‌ మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి..

APVVP Kurnool Recruitment 2022: కర్నూలు ఏపీవీవీపీలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం.. టెన్త్‌/ఇంటర్‌ పాసైతే చాలు..
Apvvp Kurnool
Follow us on

APVVP Kurnool District Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Kurnool District).. ఒప్పంద ప్రాతిపదికన పోస్ట్‌ మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: పోస్ట్‌ మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్, పారామెడికల్‌, ఎలక్ట్రీషియన్‌, ఆడియోమెట్రీ టెక్‌, డెంటల్‌ టెక్‌, ఫీమెల్‌ నర్సింగ్‌ ఆర్డినరీ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.32,670ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Nandyala, Kurnool District, AP.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 13, 2022 (సాయంత్రం 5 గంటలలోపు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.