ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ/సీఎమ్‌ఏ, ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ నైపుణ్యాలు కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనరల్ కేటగిరికి చెందిన వారికి 35 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ కేటగిరీలకు చెందని వారు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 2, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సమర్పించాలి. అనుభవం, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహిస్తారు. ఎంపికైనవారి వివరాలు ఫిబ్రవరి 15న ప్రకటిస్తారు. ఎంపికై వారికి నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.