AP SSC Supplementary Results 2022: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఫలితాలను విడుదల చేశారు. కాగా జులై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు1,91,600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 2,01,627 మంది ఫెయిల్ కావడంతో ఉత్తీర్ణత శాతం (67.26%) భారీగా తగ్గింది.
విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పదోతరగతి ఫలితాల్లో గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించారు. అలాగే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఏప్రిల్- 2022 రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనున్నారు. కరోనా కారణంగా సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడం, తరగతులు కూడా సరిగా జరగకపోవడంతో విద్యార్థుల సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈసారి 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233మంది పరీక్ష పాస్ ఆయ్యారు. ప్రకాశం జిల్లాలో 87.52 శాతం అత్యధికంగా పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం పాస్ అయ్యారు..
మరిన్ని విద్య, ఉద్యో గ వార్తల కోసం క్లిక్ చేయండి..