AP 10th Class Paper Leak: నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

|

Apr 29, 2022 | 8:47 PM

చిత్తూరు జిల్లా టెన్త్ క్లాస్ పేపర్ మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో 7 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ శుక్రవారం (ఏప్రిల్‌ 29)న టీవీ9 కు తెలిపారు..

AP 10th Class Paper Leak: నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Ap Tenth Exams
Follow us on

7 arrested in AP 10th class paper mall practice: చిత్తూరు జిల్లా టెన్త్ క్లాస్ పేపర్ మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో 7 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ శుక్రవారం (ఏప్రిల్‌ 29)న టీవీ9 కు తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్ కేసులో కార్పొరేట్ కళాశాల ప్రమేయం ఉంది. అడ్మిషన్లను పెంచుకునేందుకే నారాయణ, చైతన్యతోపాటు పలు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయి. పవన్ కుమార్ అనే టీచర్ మాల్ ప్రాక్టీస్ (mall practice) లో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. పరీక్షా పత్రాలను సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా కార్పొరేట్ కళాశాల ప్రతినిధులకు పంపాడు. పరీక్షల ప్రారంభానికి ముందు ఎక్కడా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు. మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టం. కార్పొరేట్ కళాశాలలన్నీ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారానికి తెరతీశాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగమున్న ఎవరైనా ఉపేక్షించబోమని డీఐజీ రవి ప్రకాష్ స్పష్టం చేశారు.

కాగా ఏపీలో టెన్త్‌ ఎగ్జామ్‌ క్వశ్చన్‌ పేపర్ల లీకుల వ్యవహారం కలకలం సృష్టించింది. ఇప్పటివరకు జరిగిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ పేపర్లన్నీ పరీక్షలు ప్రారంభమైన గంటకు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. పలువురు టీచర్లను అరెస్ట్‌ చేశారు. లోతుగా విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గుతేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి ఈ రోజు తెలిపారు.

 

Also Read:

ICMR NIE Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ జాబ్స్‌