AP PGCET 2025 Exam Date: ఏపీ పీజీసెట్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (APPGCET-2025) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 5వ తేదీతో ముగిసింది. అయితే విద్యార్ధుల విన్నపం మేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి తాజాగా..

AP PGCET 2025 Exam Date: ఏపీ పీజీసెట్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?
AP PGCET 2025 Application

Updated on: May 07, 2025 | 3:12 PM

అమరావతి, మే 7: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (APPGCET-2025) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 5వ తేదీతో ముగిసింది. అయితే విద్యార్ధుల విన్నపం మేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన జారీ చేసింది. దీంతో మే 11 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ వంటి దాదాపు 150కిపైగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

రూ.1000 ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.2000 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 24 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హాల్‌ టికెట్లను మే 30, 2025 వతేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీజీసెట్‌ ప్రవేశ పరీక్షలు జూన్‌ 9 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీయూఈటీ 2025 పీజీ ఫైనల్‌ కీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే?

కేంద్రీయ యూనివర్సిటీలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల నిర్వహించన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ఫైనల్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు సంబంధించి తుది కీ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరించింది. కాగా మార్చి 13, 15, 16, 18, 19, 21 నుంచి 30, ఏప్రిల్‌ 01వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ 2025 పీజీ ఫైనల్‌ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us