AP KGBV 6th Admissions 2026: కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈ రోజు (ఏప్రిల్ 10వ తేదీ)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే విద్యార్ధులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు..

AP KGBV 6th Admissions 2026: కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
AP KGBV 6th class and Inter admissions

Edited By:

Updated on: Apr 10, 2026 | 5:11 PM

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈ రోజు (ఏప్రిల్ 10వ తేదీ)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే విద్యార్ధులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆరో తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు విద్యార్ధులు ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది.

ఏపీలో కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

6, 11 తరగతుల్లో కొత్త ప్రవేశాలతోపాటు 7 నుండి 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సమగ్ర శిక్ష SPD బి శ్రీనివాసరావు గడువు పెంచారు. అర్హులైన బాలికలు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీల్లో 32,079 సీట్లకు గానూ ఇప్పటికే 69,362 దరఖాస్తులు వచ్చాయి. అనాథలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద బాలికలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే కేవలం విద్యార్హతలు, రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సందేహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 7993329115, 7075039990 ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు.

ఏపీలో కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us