AP Inter Exams: ప్లీజ్ సార్.. ఈ ఒక్కసారికి అనుమతించండి.. ఒక్క నిమిషం రూల్‌తో విద్యార్థుల కంటతడి.. వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా, రేపు సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి 'ఒక్క నిమిషం ఆలస్యమైనా' లోపలికి అనుమతించేది లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు.

AP Inter Exams: ప్లీజ్ సార్.. ఈ ఒక్కసారికి అనుమతించండి.. ఒక్క నిమిషం రూల్‌తో విద్యార్థుల కంటతడి.. వీడియో
Inter Exam

Updated on: Feb 23, 2026 | 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా, రేపు సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా’ లోపలికి అనుమతించేది లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు.. అయితే కొంతమంది ఎగ్జామ్‌ హాల్‌కి ఆలస్యంగా రావడంతో వారిని గేటు దగ్గరే ఆపేశారు సిబ్బంది.. లోపలికి పంపించాలని గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నారు విద్యార్థులు.. ట్రాఫిక్‌ కారణంగా ఆలస్యం అయ్యిందని.. ఈసారికి అనుమతించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.. సిబ్బంది అనుమతించక పోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు. ఈ ఒక్కసారికి అనుమతించాలని గేటు దగ్గరే.. నిలబడి కన్నీరుపెట్టుకున్నారు.

వీడియో చూడండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా.. 5,26,264 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని, ముందే సెంటర్ కు చేరుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us