AP Inter: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ముహూర్తం ఖరారు చేసింది. గురువారం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

AP Inter: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..
Ap Inter Advanced Supplementary Results 2026

Updated on: Jun 17, 2026 | 7:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫస్టియర్, సెకండియర్ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 21 నుండి జూన్ 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన దాదాపు 12.50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలోనే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

విద్యార్థుల ఉన్నత చదువులకు ఊరట..

ఈ ఫలితాల విడుదల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రక్రియలతో పాటు ఇతర డిగ్రీ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో రేపే ఫలితాలు విడుదలవుతుండటంతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత చదువుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లతో పాటు లీడింగ్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్ : https://bie.ap.gov.in/

ఫలితాలు చూసుకునే విధానం

  • పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో AP Inter 1st Year Supply Results 2026 లేదా AP Inter 2nd Year Supply Results 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఇంటర్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి.
  • Submit బటన్ నొక్కగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవడం మంచిది.

మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల వివరాలను కూడా ఫలితాల విడుదల సమయంలోనే అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us