AP High Court Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Oct 26, 2022 | 6:24 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలోనున్న హైకోర్టులో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP High Court Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
AP High Court Recruitment 2022
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలోనున్న హైకోర్టులో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 27 అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,220ల నుంచి రూ.80,910ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున గంటన్నర వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.