AP Edcet 2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌..

AP Edcet 2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
AP Edcet 2023

Updated on: Mar 26, 2023 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్‌సెట్‌ ప్రవేశాలను నిర్వహిస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్ధులకు రూ.650, బీసీ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.450లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.1000ల ఆలస్య రుసుముతో మే 2 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు మే 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EDCET 2022) పరీక్ష మే20 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ మే 24న విడుదల చేస్తారు. బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌  లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us