AP ECET-2026 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే

AP ECET-2026 Results Released: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2026 ఫలితాలు శుక్రవారం (మే 8న) విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ మార్కులు, ర్యాంక్ చూసుకోవడంతోపాటు ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

AP ECET-2026 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే
Ap Ecet 2026 Results Released

Updated on: May 08, 2026 | 3:26 PM

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2026 ఫలితాలు శుక్రవారం (మే 8న) విడుదలయ్యాయి.  మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు.  ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ అనంతపురం ఈ పరీక్షను గత నెల ఏప్రిల్ 23న విజయవంతంగా నిర్వహించింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, శుక్రవారం  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి మొత్తం 33,751 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 32,434 మంది (96.09%) హాజరయ్యారు. వీరిలో 29,750 మంది ఉత్తీర్ణత సాధించారు.

గత ఏడాదితో పోలిస్తే హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గినప్పటికీ, విద్యార్థులు మంచి ప్రతిభను చూపారని అధికారులు తెలిపారు. బాలుర వివరాలు చూస్తే, 21,704 మంది పరీక్ష రాయగా 19,735 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విషయానికి వస్తే, 10,730 మంది హాజరుకాగా 10,015 మంది విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రం వెలుపల ఉన్న హైదరాబాద్ పరీక్షా కేంద్రం అత్యధికంగా 97.17% ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్రంలోని జిల్లాల్లో కృష్ణా (95.43%), విశాఖపట్నం (93.30%), ఎన్టీఆర్ (92.10%) జిల్లాలు మంచి ఫలితాలతో ముందంజలో నిలిచాయి.

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ మార్కులు, ర్యాంక్ చూసుకోవడంతోపాటు ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న జరిగిన ఈసెట్ పరీక్షలకు 32,434 మంది హాజరుకాగా, 29,750 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ద్వారా ఏపీ ఈసెట్ ఫలితాల ర్యాంక్ కార్డ్ పొందాలనుకుంటే..

  • మీ మొబైల్‌లో ‘మన మిత్ర’ అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.
  • తర్వాత వచ్చే ఆప్షన్లలో “ఎడ్యుకేషన్ సర్వీసెస్”ను ఎంచుకోండి.
  • అందులో “ఏపీ ఈసెట్ ఫలితాలు 2026”పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి పంపగానే, మీ ర్యాంక్ కార్డు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Follow Us