ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్ కడప జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో.. 69 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరతగతిలో ఉత్తర్ణులై ఉండాలి. డిసెంబర్ 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. తప్పనిసరిగా పోస్టులున్న పట్టణ/గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న గృహిణి అయ్యి ఉండాలి. వివాహితలకు ప్రాధాన్యత ఉంటుంది. విడో/డివోర్స్/ఒంటరి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలో రాయడం, చడవం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
ఆ అర్హతలున్నవారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా డిసెంబర్ 12, 2022వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా డిసెంబర్ 14న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
District Medical and Health Officer, collector and District Magistrate, Kadapa, YSR District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.