AP Govt Jobs 2026: నెలకు రూ.80,500 జీతంతో ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 284 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య విభాగం (DME) విభాగం పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 విభాగాల్లో దాదాపు 284 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలను..

AP Govt Jobs 2026: నెలకు రూ.80,500 జీతంతో ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 284 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
DME AP Senior Resident Jobs

Updated on: Mar 26, 2026 | 9:43 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య విభాగం (DME) విభాగం పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 విభాగాల్లో దాదాపు 284 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తన ప్రకటనలో తెలిపింది. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌ లేదా డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి క్లినికల్ విభాగాలకు 44 ఏళ్లు, ఇతర విభాగాలకు 49 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 25, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 29, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము కింద ఓసీ అభ్యర్థులు రూ.2000. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.80,500వరకు జీతంగా చెల్లిస్తారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనాటమీలో పోస్టుల సంఖ్య: 29
  • ఫిజియాలజీలో పోస్టుల సంఖ్య: 22
  • బయోకెమిస్ట్రీలో పోస్టుల సంఖ్య: 33
  • ఫార్మకాలజీలో పోస్టుల సంఖ్య: 28
  • పాథాలజీలో పోస్టుల సంఖ్య: 32
  • మైక్రోబయాలజీలో పోస్టుల సంఖ్య:30
  • ఫోరెన్సిక్‌ మెడిసిన్ పోస్టుల సంఖ్య: 18
  • కమ్యునిటీ మెడిసిన్‌లో పోస్టుల సంఖ్య: 24
  • పీడియాట్రిక్స్‌లో పోస్టుల సంఖ్య: 2
  • డీవీఎల్‌లో పోస్టుల సంఖ్య: 1
  • సైకియాట్రిలో పోస్టుల సంఖ్య: 1
  • జనరల్ సర్జరీలో పోస్టుల సంఖ్య: 4
  • ఆర్ధోపెడిక్స్‌లో పోస్టుల సంఖ్య: 2
  • ఈఎన్‌టీలో పోస్టుల సంఖ్య: 1
  • ఆప్తమాలజీలో పోస్టుల సంఖ్య: 1
  • ఓబీజీలో పోస్టుల సంఖ్య: 2
  • అనెస్తీషియాలజీలో పోస్టుల సంఖ్య: 3
  • రేడియో డయాగ్నోసిస్‌లో పోస్టుల సంఖ్య: 4
  • ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పోస్టుల సంఖ్య: 34
  • రేడియేషన్‌ అంకాలజీలో పోస్టుల సంఖ్య: 9

ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us