AP High Court Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో టైపిస్టు ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉన్నవారు అర్హులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 170 టైపిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP High Court Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో టైపిస్టు ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉన్నవారు అర్హులు..
AP High Court Typist Recruitment 2022

Updated on: Oct 28, 2022 | 8:17 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 170 టైపిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు ఇంగ్లిష్‌ హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,220ల నుంచి రూ.80,910ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురం ఖాళీలు: 13
  • చిత్తూరు ఖాళీలు: 22
  • తూర్పు గోదావరి ఖాళీలు: 18
  • గుంటూరు ఖాళీలు: 20
  • వైఎస్ఆర్ కడప ఖాళీలు: 7
  • కృష్ణా ఖాళీలు: 13
  • కర్నూలు ఖాళీలు: 8
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 13
  • ప్రకాశం ఖాళీలు: 10
  • శ్రీకాకుళం ఖాళీలు: 12
  • విశాఖపట్నం ఖాళీలు: 14
  • విజయనగరం ఖాళీలు: 8
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 12

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us