AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ పరీక్షా ఫలితాల విడుదలకు కసరత్తు.. రేపు లేదా ఎల్లుండి.

AP Polycet Results: ఏపీలో సెప్టెంబర్‌ 1న పాలీసెట్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 72 వేల పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇదిలా ఉంటే...

AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ పరీక్షా ఫలితాల విడుదలకు కసరత్తు.. రేపు లేదా ఎల్లుండి.

Updated on: Sep 12, 2021 | 12:02 PM

AP Polycet Results: ఏపీలో సెప్టెంబర్‌ 1న పాలీసెట్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 72 వేల పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇదిలా ఉంటే అధికారులు ఈ ఏడాది ప్రశ్నా పత్రంలో మార్పులు చేపట్టిన విషయం విధితమే గతంలో 120 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్‌ 60 మార్కులకు, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉండేవి. కానీ ఈసారి అవే 120 మార్కుల ప్రశ్నపత్రంలో మ్యాథ్స్‌ 50 మార్కులకు, ఫిజిక్స్‌ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులతో పరీక్షను నిర్వహించారు. ఇక కరోనా పరిస్థితుల తర్వాత పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు ఇప్పుడు ఫలితాల విడుదలపై దృష్టి సారించారు.

నిజానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష ఫలితాలు ఈ నెల 12లోపు విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇదిలా ఉంటే తాజాగా పాలిటెక్నిక్‌ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను 13 లేదా 14 న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది . ఈ ఏడాది పాలిసెట్ కు 74,884 మంది దరఖాస్తు చేయగా .. ఇందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

Also Read: విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.. బోర్డు తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగించాడు.. ఆయనెవరో తెలుసా?

Atal Beemit Vyakti Kalyan Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌

PF Customers: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఆ గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు..!