AP Police Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోలీసు శాఖలో ఉద్యోగాలకు త్వరలో భారీ నోటిఫికేషన్! మొత్తం పోస్టులు ఇవే

AP Police Department Notification: పోలీసు శాఖలో భారీగా ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు పలు విభాగాల్లో ఏకంగా 11 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాలను పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తుంది. మొత్తం పోస్టుల్లో..

AP Police Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోలీసు శాఖలో ఉద్యోగాలకు త్వరలో భారీ నోటిఫికేషన్! మొత్తం పోస్టులు ఇవే
AP Police Department Jobs

Updated on: Oct 11, 2025 | 10:49 AM

అమరావతి, అక్టోబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో భారీగా ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు పలు విభాగాల్లో ఏకంగా 11 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాలను పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తుంది. మొత్తం పోస్టుల్లో సివిల్ ఎస్సై పోస్టులు 315, సివిల్‌ కానిస్టేబుల్ పోస్టులు 3,580, రిజర్వ్ ఎస్పై పోస్టులు 96, ఏపీఎస్పీ పోస్టులు 2,520 లతో పాటు మరిన్ని ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేస్తే పోలీస్ శాఖలో ఉద్యోగాలకు వెనువెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఫోర్స్‌ను పటిష్టం చేసేందుకు ఖాళీలను భర్తీ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా లేఖ రాయడంతో ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.

పోలీస్ శాఖలో 11,639 పోస్టులకు నోటిఫికేషన్

సెప్టెంబర్ 29న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌కు రాసిన లేఖలో పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్‌, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 31నాటికి మొత్తం 11,639 ఖాళీలు ఉన్నట్లు ప్రస్తావించారు. దీంతో ఈ పోస్టులకు ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోవడం పోలీసులకు సవాలుగా మారుతోందని ఆయన లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 6100 కానిస్టేబుల నియామక ప్రక్రియను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక డీజీపీ ప్రతిపాదించిన 11,639 పోస్టులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిరుద్యోగ యువతకు భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు

మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. యూనిఫాం సర్వీస్‌ పోస్టులకు ఈ వయోపరిమితి వర్తిస్తుంది. దీంతో వయసు కారణంగా ఉద్యోగాలకు అనర్హులైన నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.