Mega DSC 2025 Posting: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా..! ఎందుకంటే?

AP Mega DSC 2025 Posting Postponed: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎంపికైన అభ్యర్ధుల జాబితాను కూడా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ మాత్రమే మిగిలిపోయింది. అయితే ఎంపికైన అభ్యర్ధులకు..

Mega DSC 2025 Posting: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా..! ఎందుకంటే?
Mega DSC posting letters distribution postponed

Updated on: Sep 18, 2025 | 3:10 PM

అమరావతి, సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎంపికైన అభ్యర్ధుల జాబితాను కూడా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ మాత్రమే మిగిలిపోయింది. అయితే ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్‌ 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ అనూహ్యంగా ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు సర్కార్‌ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా శుక్రవారం నాటి మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందించేందుకు అసెంబ్లీ వెనుక ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడి ప్రాంగణం మొత్తం తడిసిముద్దయింది. దీంతో ఆ ప్రదేశం అనుకూలంగా లేకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలోని అభ్యర్థుల పోస్టింగ్‌లకు సంబంధించి సెప్టెంబర్‌ 22 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఇప్పటికే షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. దసరా సెలవుల్లో 22 నుంచి 29 వరకు కొత్తగా ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. దసరా సెలవుల అనంతరం వీరంతా తమకు కేటాయించిన బడుల్లో చేరనున్నారు. ఏవైనా సందేహాలుంటే 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కూడా అధికారులు సూచించారు. అయితే నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ వాయిదా పడటంతో.. కౌన్సెలింగ్‌ తేదీల్లోనూ మార్పులు చేసే అవాకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.