IAF Agniveer Rally 2026: నేటి నుంచి గుంటూరులో ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. యువత నేరుగా పాల్గొనవచ్చు

ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు సోమవారం (మార్చి 9) నుంచి ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూటింగ్‌ అధికారి వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ ఆలీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు..

IAF Agniveer Rally 2026: నేటి నుంచి గుంటూరులో ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. యువత నేరుగా పాల్గొనవచ్చు
Guntur IAF Agniveer Vayu rally

Updated on: Mar 09, 2026 | 9:00 AM

అమరావతి, మార్చి 9: భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు సోమవారం (మార్చి 9) నుంచి ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూటింగ్‌ అధికారి వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ ఆలీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ రోజు నుంచి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మొదలవనుంది. మార్చి 9, 10 తేదీల్లో మహిళలకు, మార్చి 12, 13 తేదీల్లో ఏపీ పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. ఇక మార్చి 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు.

ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే అభ్యర్ధులు 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించి ఉండాలి. అలాగే అవివాహిత మహిళలు, పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్ధుల కనీస ఎత్తు 152 సెంటీ మీటర్లు. అలాగే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్, మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో ఏదైనా ఒక కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరైనా తమ మెయిల్‌ ఐడీ, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ప్రతి సర్టిఫికెట్‌కు 6 జిరాక్స్‌ కాపీలు, 10 పాస్‌పోర్టు ఫొటోలు తీసుకొని నేరుగా ఆచార్య నాగార్జున యూనివర్సిలో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చు. ముందస్తు దరఖాస్తు ప్రక్రియ ఏమీ ఉండదు.

ఆసక్తి కలిగిన వారు నేరుగా గుంటూరులోని ఏఎన్‌యూకి చేరుకుంటే సరిపోతుంది. ఆయా తేదీల్లో అభ్యర్థులకు 1.6 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. అనంతరం భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. అనంతరం ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. అంటే ఒక తప్పు జవాబుకు పావు1/3 చొప్పున మార్కు కోత విధిస్తారు. నిరుద్యోగ అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ ఆలీ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us