AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Aug 16, 2022 | 9:28 AM

AIIMS Recruitment 2022: ఆంధప్రదేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపస్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Follow us on

AIIMS Recruitment 2022: ఆంధప్రదేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపస్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమోన్‌స్ట్రేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* బయోకెమిస్ట్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్, రేడియో డయాగ్నోసిస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ, డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లాలో నిర్వహిస్తారు.

* వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూను 25-08-2022 తేదీని నిర్వహించనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులకు రూ. 50,000 నుంచి రూ. 70,000 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…