వైద్య విద్యార్థులకు శుభవార్త.. ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

దేశ వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏఐఏపీజీఈటీ-2026 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 30 వరకు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వైద్య విద్యార్థులకు శుభవార్త.. ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల
AIAPGET Admissions

Updated on: Jul 14, 2026 | 6:29 AM

దేశవ్యాప్తంగా ఆయుష్ వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AIAPGET)–2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు ఈ పరీక్ష ఆధారంగా చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఐఏపీజీఈటీ-2026కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఏఎంఎస్ (BAMS), బీయూఎంఎస్ (BUMS), బీఎస్‌ఎంఎస్ (BSMS), బీహెచ్‌ఎంఎస్ (BHMS) లేదా గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా తప్పనిసరిగా ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 30, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ. 2,700, జనరల్–ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్ధులు రూ. 2,450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1800 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది.

పరీక్ష విధానం ఇదే..

AIAPGET-2026 (ఏఐఏపీజీఈటీ 2026) పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో (CBT) నిర్వహించబడుతుంది. మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. ఇలా మొత్తం 480 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఆయుష్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు ఏఐఏపీజీఈటీ 2026 ఒక కీలక అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 30, 2026.
  • పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: జూలై 30, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్టు 1, 2 తేదీల్లో
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: ఆగస్టు 22, 2026.

ఏఐఏపీజీఈటీ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us