AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం...

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Airports Authority of India

Edited By:

Updated on: Aug 30, 2022 | 2:20 PM

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 156 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) ఎన్‌ఈ-4 (132), జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) ఎన్‌ఈ -4 (10), సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్‌) ఎన్‌ఈ -6 (13), సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) ఎన్‌ఈ-6 (01) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25-08-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, వైద్య, ఫిజికల్‌ టెస్ట్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి 92,000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36,000 నుంచి 1,10,000 వరకు చెల్లిస్తారు.

* కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ సెంటర్స్‌ను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడలో ఏర్పాటు చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ 01-09-2022న మొదలై 30-09-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us