Free Coaching for Minorities 2022: మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 1445 పోస్టులు.. ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

|

Apr 19, 2022 | 8:06 AM

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో 1445 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌..

Free Coaching for Minorities 2022: మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 1445 పోస్టులు.. ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
NHM Telangana
Follow us on

Teacher Job vacancies in TMREIS 2022: తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో 1445 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ప్రభుత్వం 80వేల ఉద్యోగాలను భర్తీచేయనున్న నేపథ్యంలో మైనార్టీ ఉద్యోగార్థులకు స్టడీసెంటర్లలో ఉచిత శిక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి నదీం అహ్మద్, డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ ఇంతియాజ్‌తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. గ్రూప్‌-1, 2, 3 పోస్టుల కోసం పూర్వ జిల్లాకేంద్రాల్లోని స్టడీ సెంటర్లలో, గ్రూప్‌-4 కోసం 33 జిల్లాకేంద్రాల్లో రంజాన్‌ తరవాత శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మైనార్టీ సంక్షేమశాఖలో ఆరు జిల్లా సంక్షేమాధికారులు, 10 సహాయ సంక్షేమాధికారులు, 15 హౌస్‌ సంక్షేమాధికారులు, 28 జూనియర్‌ అసిస్టెంట్లు, 4 ఉర్దూ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. గురుకుల సొసైటీలోని పోస్టులను గురుకుల నియామక సంస్థ ఆధ్వర్యంలో భర్తీచేస్తామని ప్రకటించారు.

మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో పోస్టులివే…

  • టీజీటీ పోస్టులు: 594
  • జూనియర్‌ లెక్చరర్లు పోస్టులు: 414
  • లైబ్రేరియన్లు పోస్టులు: 200
  • స్టాఫ్‌నర్సులు పోస్టులు: 127
  • ఫిజికల్‌ డైరెక్టర్లు పోస్టులు: 60
  • క్రాఫ్ట్‌ టీచర్లు పోస్టులు: 38
  • పీఈటీలు పోస్టులు: 12

Also Read:

APPSC Group-IV: మే 1న ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 నమూనా పరీక్ష.. ఇలా నమోదు చేసుకోండి..