కెఫేకు తాత్కాలిక చైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్

Cafe Coffee Day appoints SV Ranganath as interim chairman after VG Siddhartha's death, కెఫేకు తాత్కాలిక చైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్

కెఫే కాఫీ డే తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్ నియమితులయ్యారు. సిద్ధార్థ ఆకస్మిక మృతి నేపథ్యంలో కంపెనీ బాధ్యతలు.. బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్‌లో ఒకరైన రంగనాథ్‌కు అప్పగించారు. కాగా.. సిద్ధార్థ రాసినట్లుగా మీడియాలో వస్తున్న లేఖ గురించి బోర్డు సభ్యులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయనే రాశారా..? లేక ఏదైనా కారణముందా..? అని సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సిద్ధార్థ రాసిన లేక అస్పష్టంగా ఉందని, దానిపై దర్యాప్తు జరపాలని కంపెనీ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.

కాగా.. సిద్ధార్థ మృతదేహాన్ని తన స్వస్థలమైన చిక్‌మంగళూరు తరలించారు. అక్కడి ఏసీబీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం ఈ రోజు సాయంత్రం కాఫీ ఎస్టేట్‌లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *