Zerodha Offer: ఉద్యోగులకు ఆఫర్.. బరువు తగ్గితే బోనస్ ఇస్తానంటున్న ఆ కంపెనీ సీఈవో

|

Apr 08, 2022 | 6:32 PM

Zerodha Offer: స్టాక్ మార్కెట్(Stock Market) ప్రపంచంలో పరిచయం ఉన్న వారిలో జెరోదా గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ కంపెనీ సీఈవో తాజాగా ఉద్యోగులకు బోనస్ అందించే విషయంలో ఆరోగ్యకరమైన పోటీకి తెరతీశారు.

Zerodha Offer: ఉద్యోగులకు ఆఫర్.. బరువు తగ్గితే బోనస్ ఇస్తానంటున్న ఆ కంపెనీ సీఈవో
Zerodha
Follow us on

Zerodha Offer: స్టాక్ మార్కెట్(Stock Market) ప్రపంచంలో పరిచయం ఉన్న వారిలో జెరోదా గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అనతి కాలంలోనే స్టార్టప్ గా ప్రారంభమై తన స్పీడ్, లో కాస్ట్ బ్రోకరేజ్ సర్వీసెస్(Brokerage Services) తో అనేక మంది వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ ఇది. ఇప్పుడు జెరోదా ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ తమ ఉద్యోగులకు బంపరాఫర్‌ను ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఉద్యోగల మధ్య ఆసక్తికర పోటీకి తెరలేపారు జెరోదా సీఈవో నితిన్‌ కామత్‌. గతంలో ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షలు బోనస్‌ కూడా అందించారు ఆయన.

తాజాగా.. మరో సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు నితిన్ కామత్. అదేంటంటే 25 కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఉన్న ఉద్యోగులకు సగం నెల జీతం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి తోడు తమ కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సగటు BMI 25.3గా ఉందని.. దీనిని ఆగష్టు నాటికి 24 కంటే కిందకు తీసుకువస్తే ఉద్యోలందరికీ సగం నెల జీతం బోనస్‌గా ఇస్తానంటూ ఆరోగ్యకరమైన ఆఫర్ ప్రకటించారు.

అసలు ఇలాంటి ఆఫర్ ఎందుకంటే..

ఆర్యోగంగా ఉంటే మిగిలిన అన్నింటినీ సాధించవచ్చు. అయితే ఫిట్‌గా ఉండేందుకు వర్కట్లు ప్రారంభించడమే కష్టమైన పని. అందుకే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కి సంబంధించి బీఎంఐ అనేది అంత శ్రేష్టమైన కొలమానం కాకపోయినప్పటికీ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది తేలికైన విధానం. ఈ కారణం చేతనే BMI పోటీ పెడుతున్నట్టు నితిన్‌ కామత్‌ తెలిపారు. రోజుకు 10 వేల అడుగుల నడకతో ఈ పోటీని ప్రారంభించ మంటూ ఉద్యోగులకు ఆయన సూచించారు. దీని గురించి ఆయన ట్విట్టర్ వేధికగా చేసిన ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపటాన్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇలాంటి పోటీలతో ప్రతికూల ప్రభావాలు ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవంజడి..

Satya Nadella: ఉద్యోగులతో అలా పనిచేయించవద్దన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల.. కీలక సూచనలు..

Tax Issue: టాక్స్ చెల్లించని దిగ్గజ వ్యాపారి కుమార్తె.. ప్రజలపై భారీగా పన్నులు పెంచారంటూ ప్రతిపక్షాల విమర్శలు