YouTubeలో భారీ మార్పులు.. ఇక సంపాదించాలంటే 8,000 గంటల వాచ్‌టైమ్, 2 కోట్ల Shorts వ్యూస్ తప్పనిసరి!

యూట్యూబ్ ఆగస్టు 10న తన కొత్త మానిటైజేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రభావం వచ్చే నెల నుండి కనిపిస్తుంది. అప్పుడు YouTube Updates: కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదించడానికి ఈ కొత్త మానిటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ..

YouTubeలో భారీ మార్పులు.. ఇక సంపాదించాలంటే 8,000 గంటల వాచ్‌టైమ్, 2 కోట్ల Shorts వ్యూస్ తప్పనిసరి!
Youtube

Updated on: Aug 12, 2026 | 4:38 PM

YouTube Updates: మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తున్నా, లేదా అలా చేయాలని ఆలోచిస్తున్నా, మీకోసమే ఈ వార్త. కంటెంట్ క్రియేటర్ల నుండి డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కింద ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం ద్వారా డబ్బు సంపాదించడానికి మీరు గతంలో కంటే కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అవసరమైన వ్యూస్‌, వ్యూ్‌స్‌ సమయాలు రెండింటినీ పెంచింది.

నూతన సృష్టికర్తలకు కష్టతరం:

  1. యూట్యూబ్‌కు కొత్తగా వచ్చిన వారికి, డబ్బు సంపాదించే ప్రయాణం దాదాపు రెండింతలు కష్టంగా మారింది. కొత్త నిబంధనలతో డబ్బు సంపాదించడం ఇకపై సులభ కాదు.
  2. 8,000 వాచ్‌ అవర్స్‌: సృష్టికర్తలు ఇప్పుడు ఒక సంవత్సరంలోపు 8,000 వాచ్‌ఆవర్స్‌లను చేరుకోవాలి. గతంలో ఈ పరిమితి కేవలం 4,000 గంటలు మాత్రమే ఉండేది.
  3. 2 కోట్ల షార్ట్స్ వ్యూస్‌లు: యూట్యూబ్ షార్ట్స్ నుండి సంపాదించడానికి ఇప్పుడు మీరు 90 రోజుల్లో 1 కోటి (10 మిలియన్లు) కాదు, 2 కోట్ల (20 మిలియన్లు) వ్యూస్‌ పొందవలసి ఉంటుంది.
  4. 1000 మంది సబ్‌స్క్రైబర్లు: ఈ ప్రాథమిక నియమం యథాతథంగా కొనసాగుతుంది. ఒక ఛానెల్‌కు కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే నిబంధన అమలులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి వరుస సెలవులు!

ఈ నియమాలు పాత సృష్టికర్తలకు కూడా వర్తిస్తాయా?

ఈ కొత్త నియమాలు ఇప్పటికే సంపాదిస్తున్న క్రియేటర్లకు కూడా వర్తిస్తాయి. యాడ్స్, సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా షార్ట్స్ వీడియోల నుండి డబ్బు సంపాదించడానికి వారు ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల వ్యూస్‌ను కూడా సాధించాలి. ఒకవేళ క్రియేటర్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే వారి షార్ట్స్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. అయితే నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుండి వచ్చే ఆదాయం కొనసాగుతుంది. షార్ట్స్ వ్యూస్ 10 మిలియన్లు దాటిన తర్వాత ఆదాయం ఆటోమేటిక్‌గా తిరిగి ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఎక్కువ డిటర్జెంట్ వేస్తే ఏమవుతుంది? పెద్ద పొరపాటు చేస్తున్నట్లే..!

గతంలో 2018లో యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో ఒక పెద్ద మార్పు చేసింది. ఆ తర్వాత కొన్ని చిన్న షరతులు జోడించింది. కానీ ఈ ప్రధాన మార్పు ఇప్పుడు జరిగింది. ప్రస్తుతం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా క్రియేటర్లు చురుకుగా ఉన్నారు. యూట్యూబ్‌లో ప్రతిరోజూ షార్ట్స్ వీడియోలు 20 బిలియన్లకు పైగా సార్లు వీక్షిస్తున్నారు. ఈ కొత్త పాలసీతో కంపెనీ ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించాలనుకుంటోంది.

యూట్యూబ్ ఆగస్టు 10న తన కొత్త మానిటైజేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రభావం వచ్చే నెల నుండి కనిపిస్తుంది. అప్పుడు కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదించడానికి ఈ కొత్త మానిటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కంటెంట్ క్రియేటర్‌గా మారి యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. పెరుగుతున్న ఈ జనసమూహానికి ప్రతిస్పందనగా, యూట్యూబ్ తన నిబంధనలను కఠినతరం చేసింది.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర.. రికార్డ్‌ స్థాయి దిశగా వెండి..!

ఇది కూడా చదవండి: DMart Offers: ఇక పండగే.. పండగ.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us