
Gold and Silver Rate In 2025: దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్న తరుణంలో నిన్నటి నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. తులం బంగారం ధర దాదాపు 1,42,000 వరకు వెళ్లి బంగారం ధర.. మంగళవారం నుంచి క్రమంగా దిగి వస్తున్నాయి. వెండి కూడా అంతే ధర రూ.1,70,000 వరకు వెళ్లిన వెండి ధర.. ఇప్పుడు భారీగానే దిగి వస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ 31న బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,35,880 వద్దకు చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.2,40,000 వేల వద్ద కొనసాగుతోంది.
ఈ ఏడాదిలో బంగారం, వెండి ఎంత పెరిగింది?
ఈ ఏడాది 2025 జనవరి 1వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,000 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగింది. ప్రస్తుతం తులం ధర రూ.1,35, 880 వద్ద ఉంది. ఇదే విధంగా వెండి కిలోకు రూ.90,000 వద్ద ఉండేది. ప్రస్తుతం రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: RBI New Rules: ఈ 3 రకాల బ్యాంకు అకౌంట్లు జనవరి 1 నుంచి క్లోజ్.. ఇందులో మీది కూడా ఉందా?
2025 సంవత్సరంలో బంగారం, వెండి ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. దీనిలో బంగారం ధర 74 శాతానికి పైగా పెరిగింది. వెండి ధర 138 శాతం పెరుగుదలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం, బంగారు ETF కోసం డిమాండ్, దీని కారణంగా బంగారం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక డిమాండ్ కారణంగా వెండి ధర ఎక్కువగానే ఉంది. ఈలోగా వెండి సరఫరా, డిమాండ్‌కు సంబంధించి మార్కెట్లో కూడా మార్పులు కనిపించాయి. 2026 సంవత్సరంలో బంగారం, వెండి పెరుగుదల కొనసాగుతుందని అంచనా. 2025 సంవత్సరం బంగారం, వెండి, రాగికి నిర్ణయాత్మక సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే మూడు లోహాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది 40 సంవత్సరాలకు పైగా కాలంలో అత్యంత బలమైన వస్తువుల ర్యాలీలలో ఒకటిగా ఉన్నాయని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆనంత్ రతి, స్టాక్ బ్రోకర్స్‌లోని కమోడిటీస్ అండ్ కరెన్సీ డైరెక్టర్ నవీన్ మాథుర్ ప్రకారం, 2025 విలువైన లోహాలకు అసాధారణమైన సంవత్సరం. రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థల నుండి హెడ్జ్ ఫండ్స్, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వరకు అన్ని రంగాలలోని పెట్టుబడిదారులు బంగారంలో తమ పెట్టుబడులను పెంచారు.బంగారం, వెండి నాలుగు దశాబ్దాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. 2025లో వెండి దాదాపు 138 శాతం పెరిగి, ప్రముఖ ఆస్తిగా మారింది. అలాగే బంగారం ధరలు 74 శాతానికి పైగా పెరిగాయి. ఇది దశాబ్దంలో అత్యంత లాభదాయకంగా మారింది.
2025లో బంగారం, వెండి నుండి వచ్చే రాబడి స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడి రాబడి కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పారిశ్రామిక డిమాండ్ కారణంగా వెండి రికార్డు లాభాలను చవిచూసింది. ఈ సంవత్సరం వెండి బంగారం కంటే 100 శాతం రాబడిని అందించింది. బంగారం 83 శాతం రాబడిని అందించింది. అదే సమయంలో నిఫ్టీ 50 డిసెంబర్ 19, 2025 నాటికి 9.4 శాతం రాబడిని అందించింది.
ఇది కూడా చదవండి: Vande Bharat Express: ఆ సమయంలో ప్యాసింజర్ రైళ్ల స్పీడ్‌తోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి