AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamaha Fascino S Scooter: కారు తరహా ఫీచర్‌ బైక్‌లో.. పిలిస్తే పలుకుతుంది.. యమహా కొత్త వేరియంట్‌తో సెన్సేషన్‌..

యమహా నుంచి విజయవంతమైన మోడల్‌ యమహా ఫాసినో 125. ఇప్పుడు దీని కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఏకంగా 5 మోడళ్లు ఈ కొత్త వేరియంట్లో ఉన్నాయి. అంతేకాక ఇందులో వినూత్నమైన 'ఆన్సర్ బ్యాక్' ఫంక్షన్ ఉంది. ఈ లేటెస్ట్ మోడల్ మాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 93,730, డార్క్ మ్యాట్ బ్లూ రూ. 94,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Yamaha Fascino S Scooter: కారు తరహా ఫీచర్‌ బైక్‌లో.. పిలిస్తే పలుకుతుంది.. యమహా కొత్త వేరియంట్‌తో సెన్సేషన్‌..
Yamaha Fascino S Scooter
Madhu
|

Updated on: Jun 14, 2024 | 3:07 PM

Share

యమహా బ్రాండ్‌కు మన దేశంలో మంచి డిమాండ్‌ ఉంది. కేవలం ఆ బ్రాండ్‌ కు వ్యాల్యూని బట్టే దాని ఉత్పత్తుల అమ్మకాలు కొనసాగుతాయి. కాగా స్కూటర్ల విషయంలో యమహా నుంచి విజయవంతమైన మోడల్‌ యమహా ఫాసినో 125. ఇప్పుడు దీని కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఏకంగా 5 మోడళ్లు ఈ కొత్త వేరియంట్లో ఉన్నాయి. అంతేకాక ఇందులో వినూత్నమైన ‘ఆన్సర్ బ్యాక్’ ఫంక్షన్ ఉంది. ఈ లేటెస్ట్ మోడల్ మాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 93,730, డార్క్ మ్యాట్ బ్లూ రూ. 94,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా ఈ యమహా ఫాసినో ఎస్‌ 125సీసీ స్కూటర్ ఇప్పటి భారతీయ మార్కెట్లో ఉత్తమంగా ఉన్న సుజుకి బర్గెమాన్ స్ట్రీట్ 125, హెూండా యాక్టివా 125, టీవీఎస్‌ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 వంటి ఇతర ప్రముఖ మోడళ్లతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది.

వినూత్నమైన ఫీచర్‌..

ఈ కొత్త ఫాసినో ఎస్‌ స్కూటర్‌ ప్రత్యేక ఫీచర్‌ ‘ఆన్సర్ బ్యాక్’ ఫంక్షన్. ఇది యజమానులు తమ స్కూటర్ను దూరం నుంచి గుర్తించడంలో సహాయపడుతుంది. రెండు సైడ్ ఇండికేటర్లు, హారన్‌ను దాదాపు రెండు సెకన్ల పాటు యాక్టివేట్ చేయడం ద్వారా, ఈ ఫీచర్ వినియోగదారులు రద్దీగా ఉండే లేదా మసక వెలుతురు ఉన్న ప్రాంతాల్లో తమ స్కూటర్ను సులభంగా కనుగొనవచ్చు. సాధారణంగా ఇది కార్లలో ఉంటుంది. స్కూటర్లో ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి, యజమానులు గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ‘Yamaha Scooter Answer Back’ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్లోని ఆన్సర్ బ్యాక్ ఎంపికను నొక్కాలి. కొత్త ఫీచర్తో పాటు, ఫాసినో ఎస్‌ సైలెంట్ ఫార్టర్, సాధారణ, ట్రాఫిక్ మోడ్లతో ఆటోమేటిక్ పార్ట్-ఫ్లాప్ ఫంక్షన్తో సహా అనేక ప్రత్యేక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ ఫీచర్లు స్కూటర్ సౌలభ్యం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఇది పట్టణ ప్రయాణాలకు ఆచరణాత్మక ఎంపికగా చేస్తుంది.

స్పెసిఫికేషన్లు..

దీని స్పెసిఫికేషన్ల మాత్రం పెద్దగా మార్పుల్లేవు. 8.04బీహెచ్‌పీ, 10.3ఎన్‌ఎం టార్క్‌ను అందించే 125సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో కొనసాగుతుంది. ఈ స్కూటర్ 5.2 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీ, 99కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది. ఇది 12-అంగుళాల, 10-అంగుళాల అల్లాయ్ వీల్స్తో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్తో ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. సస్పెన్షన్ కిట్తో పాటు ముందువైపు ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..