
ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్టంట్ లోన్ వంటివి తీసుకోవచ్చు. అయితే మీరు అత్యవసర సమయంలో నిధుల కోసం లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. లేకపోతే మీకు ఏ బ్యాంక్, ఆర్ధిక సంస్థలు రుణాలు మంజూరు చేయవు. అందుకే క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుకోవాలి. 750పైన ఉండటం వల్ల మీకు రుణాలు, క్రెడిట్ కార్డులు త్వరగా మంజూరవుతాయి. ఇక క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వివరాలు తప్పుగా ఉంటే సరిదిద్దుకోవాలి.
ఇక మీ క్రెడిట్ రిపోర్టులో ” Written Off ” అనే పదం ఉందా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. రిటన్ ఆఫ్ అంటే మీ రుణం రద్దు లేదా మాఫీ చేసినట్లు అర్థం కాదు. మీరు రుణం చెల్లించలేని పక్షంలో.. కస్టమర్ చెల్లించడం అసాధ్యమని బ్యాంక్ నమ్మిన సందర్భాలో ఆ అకౌంట్‌ను రికార్డుల్లో నష్టంగా చూపించి తాత్కాలికంగా మూసివేస్తారు. దీనినే ‘Written Off’ అని అంటారు. బ్యాంకు తన రికార్డుల్లో దీనిని నష్టంగా చూపిస్తుంది. మిమ్మల్ని డీఫాల్టర్‌గా పరిగణిస్తారు. దీని వల్ల వమీ క్రెడిట్ స్కోర్ దారుణంగా దెబ్బతింటుంది. మీరు ఆరు నెలల పాటు ఈఎంఐ చెల్లించకపోతే డీఫాల్టర్‌గా పరిగణిస్తారు. మీపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవచ్చు. దీంతో మీ క్రెడిట్ రిపోర్టులో ఈ పదం ఉంటే వెంటనే జాగ్రత్త పడింది. వెంటనే బకాయిలు చెల్లించండి. లేకపోతే మీకు భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
-బ్యాంక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి లోన్ అకౌంట్ క్లోజ్ చేయాలి
-మీరు లోన్ చెల్లించాక వారం రోజుల తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌లో అప్డేట్ అవుతుంది.
-మీ క్రెడిట్ రిపోర్టులో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది
-మీరు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తే క్రెడిట్ హిస్టరీని కాపాడుకోవచ్చు.