SBI YONO: వినియోగదారులను పరేషాన్‌ చేస్తున్న ఎస్‌బీఐ మెసేజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. విషయం ఏంటంటే..

SBI YONO: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? బ్యాంకు నుంచి ఈ మెసేజ్‌ వచ్చిందా? ప్రస్తుతం ఈ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన వినియోగదారులు ఆందోళనకు గురై తొందరపడుతున్నారు. అసలు విషయం తెలిసి షాకవుతున్నారు కస్టమర్లు..

SBI YONO: వినియోగదారులను పరేషాన్‌ చేస్తున్న ఎస్‌బీఐ మెసేజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. విషయం ఏంటంటే..
Sbi Yono

Updated on: Apr 15, 2026 | 8:05 PM

SBI YONO Aadhaar Update: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? మీకు ఆధార్ అప్‌డేట్ సందేశం అందిందా? ఈ దేశం బ్యాంకు వినియోగదారులను పరేషాన్‌ చేస్తోంది. ఇలాంటి మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది సదరు బ్యాంకు. ఒక చిన్న పొరపాటుతో మీరు నష్టపోవచ్చు. ఖాతాదారులను హెచ్చరించారు. పీఐబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. ఏంటా మెసేజ్‌.. ఆ మెసేజ్‌ వల్ల నష్టాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఇటీవల ఎస్‌బిఐ కస్టమర్లు తమ ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే ఎస్‌బిఐ యోనో యాప్ పనిచేయడం ఆగిపోతుందని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందేశంలో ఒక APK ఫైల్ లింక్ కూడా ఉంది. ఆ లింక్‌లో వారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోమని కోరారు.

Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

ఈ సందేశం వినియోగదారులలో కలకలం సృష్టించింది. చాలామంది ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ వాదన పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) స్పష్టం చేసింది. ఇది ఒక మోసపూరిత ఉచ్చు. ఎస్‌బిఐ అటువంటి ఆధార్ అప్‌డేట్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

ఇవి కూడా చదవండి

సామాన్య ప్రజలను భయపెట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి సందేశాలు పంపుతున్నారని పీఐబీ తెలిపింది. ఎస్‌బిఐ ఎప్పుడూ వినియోగదారులను అలాంటి ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోమని అడగదు. అలాగే ఫోన్ లేదా మెసేజ్ ద్వారా పాస్‌వర్డ్, ఓటీపీ లేదా ఆధార్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఎప్పుడూ అడగదు.

SBI కస్టమర్‌లు ఆందోళన చెందవద్దని, అలాంటి సందేశాలు వస్తే వాటిపై క్లిక్ చేయవద్దని కోరారు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల ఫోన్ భద్రత ప్రమాదంలో పడవచ్చు. ఇలాంటి ఫైల్స్ మొబైల్ సమాచారాన్ని దొంగిలించి, బ్యాంకు ఖాతా వివరాలను మోసగాళ్లకు అందిస్తాయి. వీటిని ఫిషింగ్ స్కామ్‌లు అంటారు. తెలియని మూలాల నుండి యాప్‌లను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయకూడదు. మీకు అలాంటి మోసపూరిత సందేశం ఏదైనా వస్తే, మీరు report.phishing@sbi.co.in కు ఇమెయిల్ చేయడం ద్వారా దానిని రిపోర్ట్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Summer Tips: వేసవిలో బూట్ల దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఉతకాల్సిన అవసరం లేకుండానే చెడు వాసన పోగొట్టే చిట్కాలు ఇవే!

SBI

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us