
రైళ్లల్లో ప్రతీఒక్కరూ ఒక్కసారైనా ప్రయాణం చేసి ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఎక్కువమంది రైలు జర్నీనే ఎంచుకుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, తక్కువగా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అయితే రైల్వే ప్రయాణం చేసేవారందరూ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంకు, ట్రైన్ తలుపుకు మధ్య ఎత్తు ఒకేలా ఉంటుందనే విషయం గమనించే ఉంటారు. దీని విల్ల ప్రయాణికులు సులువుగా ట్రైన్ ఎక్కడం, దిగడం, సామాన్లు తీసుకెళ్లవచ్చు. ప్రయాణికుల భద్రత, సులభంగా ఎక్కడం, దిగడం, సామాన్లు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రతీ స్టేషన్లోనూ ఫ్లాట్ ఫామ్ ఎత్తు, ట్రైన్ తలుపు మధ్య ఎత్తులో పెద్దగా తేడాలు ఉండవు.
రైల్వే నిబంధనల ప్రకారం ఫ్లాట్ ఫామ్ ఎత్తును నిర్ణయిస్తారు. ఫ్లాట్‌ఫామ్ నిర్మించేటప్పుడు ఇష్టానుసారంగా నిర్మించరు. కొన్ని ప్రమాణాలను ఇందుకు పాటిస్తారు. ప్రయాణికులు ఈజీగా ఎక్కడం, దిగడం లాంటివి చేసేందుకు వీలుగా రైల్వేశాఖ రూల్స్ ప్రకారం ఫ్లాట్ ఫామ్ ఎత్తును నిర్ణయించడం జరుగుతుంది. ఫ్లాట్ ఫామ్ ఎత్తు, రైలు తలుపుకు మధ్య పెద్ద గ్యాప్ ఉంటే ప్రయాణికులు జారి కింద పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు. కింద పడి గాయాలు పాలయ్యే అవకాశముంటుంది. ఫ్లాట్ ఫామ్ ఎత్తుకు సరిసమానంగా ట్రైన్ తలుపు లేకపోతే సామాన్లు లోపలికి తీసుకెళ్లడం కూడా కష్టతరమవుతుంది. ఇక వృద్దులు,పిల్లలు, గర్బిణులు, వికలాంగులు, దివ్యాంగులు కూడా సులువుగా ట్రైన్ ఎక్కేందుకు అనుకూలంగా ఫ్లాట్ ఫామ్, రైలు తలుపు ఎత్తు ఒకేలా ఉండేలా నిర్మిస్తారు. అయితే అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఎత్తు ఒకేలా ఉండదు. రైల్వే స్టేషన్ల అవసరాలు, రైల్వే మార్గంను బట్టి మారతాయి.
అయితే దేశంలో వివిధ రకాల రైళ్లు నడుస్తున్నాయి. ప్రతీ రకం రైలు డిజైన్ ఒకేలా ఉండదు. అలాగే రైల్వే లైన్లు ఒకే అవసరం కూడా రూపొందించరు. దీంతో సదరు రైల్వే లైన్‌తో పాటు ఆ మార్గంలో నడిచే రైళ్ల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఫ్లాట్ ఫామ్ ఎత్తును నిర్ణయిస్తారు. దీంతో రైల్వేశాఖ నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఫ్లాట్‌ఫామ్, రైలు తలుపు ఎత్తు ఒకేలా ఉండేలా నిర్మిస్తారు. దీని ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఎక్కడం, దిగడం లాంటివి చేయవచ్చు. అన్ని రైల్వే స్టేషన్లల్లో ఫ్లాటా ఫామ్ ఎత్తు ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం. ఆ రూట్లో తిరిగే రైళ్లు, స్టేషన్ అవసరాలను బట్టి ఎత్తులో తేడాలు ఉండవచ్చు.