Silver Anklet: మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూపర్‌ టిప్స్‌..!

Silver Anklet: వెండికి కూడా బీఐఎస్‌ హల్‌ మార్క్‌ వచ్చేసింది. సిల్వర్‌పై కూడా 925 ప్యూరిటీ అని హాల్ మార్క్ పైన రాసి ఉంటుంది. హాల్‌మర్క్‌ ఉన్న అభరణాలు మాత్రమే ధరించాలి. కాళ్ల పట్టిలను ఎక్కువగా కెమికల్స్ డిటర్జెంట్లతో రుద్దినట్లయితే అవి అరిగిపోయే ప్రమాదం..

Silver Anklet: మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూపర్‌ టిప్స్‌..!
Silver Anklet

Updated on: Jul 12, 2026 | 7:47 AM

Silver Anklet: మన భారతీయ సంప్రదాయంలో మహిళలకు కాళ్లకు పట్టీలు ధరించడం అత్యంత ముఖ్యమైనది.ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కాళ్లకు పట్టీలు ధరించడం అనేది ఆనవాయితీ. ఈ కాళ్ల పట్టీలు ప్రతి రోజు ధరిస్తుంటారు. భారతదేశంలో గజ్జెలతో కూడా వెండి పట్టీలు ధరించడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. వెండి కాలి గొలుసులు, కాలి ఉంగరాలు పాదాల అందాన్ని పెంచుతాయి.

సాధారణంగా కాళ్ల పట్టీలను వెండితో తయారు చేస్తారు. అయితే ఈ పట్టీలు ప్రతి రోజు ధరించడం వల్ల ఆగిరపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పట్టీలు ఆరగకుండా చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా వెండిలో రెండు రకాల ఫ్యూరిటీ క్వాలిటీలు ఉంటాయి. 999 క్వాలిటీ అనేది స్వచ్‌చమైన వెండి. ఇక 925 క్వాలిటీ అనేది ఇతర లోహాలతో కలిపి చేసిన వెండి. సాధారణంగా కాళ్ల పట్టిలను 999 క్వాలిటీతో తయారు చేయరు. ఎందుకంటే ప్యూరిటీ ఎక్కువగా ఉన్న వెండి త్వరగా వంగిపోవడము లేదా అరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్‌ సైడ్‌కు ఉండే ఆ గీతల వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా? ఇది డిజైన్ పొరపాటే..!

అలాగే 7.5% రాగి లేదా ఇతర లోహాలను కలిపి 925 క్వాలిటీ వెండితో కాళ్ల పట్టీలను తయారు చేయిస్తారు. ఇవి కాస్త రోజు వారి వాడుకోవడానికి బలంగా అనుకూలంగా ఉంటాయి. నిత్యం ధరించే వాటికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా 925 క్వాలిటీ వెండిని స్టెర్లింగ్ వెండి అని పిలుస్తారు. వీటితో ఆభరణాలను తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం హ్యాండ్ మేడ్ ఫినిషింగ్ వెండి పట్టీలు లభించడం లేదు. అంతా మెషిన్ మేడ్ చైన్లు లభిస్తున్నాయి. అయితే హ్యాండ్ మేడ్ చైన్లతో పోల్చి చూస్తే మెషిన్ మేడ్ చైన్లు బలంగా ఉంటున్నాయి. కనుక మెషిన్ మేడ్ చైన్స్ కాల పట్టీలుగా ధరిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వెండి కాళ్ల పట్టిన పైన రోడియం కోటింగ్ చేస్తే ఇంకా మంచిదని, తద్వారా అవి నల్లబడకుండా అరిగిపోకుండా చాలా కాలం పాటు ఉంటాయని స్వర్ణకారులు సూచిస్తున్నారు.

వెండికి కూడా బీఐఎస్‌ హల్‌ మార్క్‌ వచ్చేసింది. సిల్వర్‌పై కూడా 925 ప్యూరిటీ అని హాల్ మార్క్ పైన రాసి ఉంటుంది. హాల్‌మర్క్‌ ఉన్న అభరణాలు మాత్రమే ధరించాలి. కాళ్ల పట్టిలను ఎక్కువగా కెమికల్స్ డిటర్జెంట్లతో రుద్దినట్లయితే అవి అరిగిపోయే ప్రమాదం ఉంటుందని, మైల్డ్ సోప్ వాటర్ తో కడిగితే సరిపోతుందని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.9000 ఆదాయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us