
Akshaya Tritiya 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకునే ఈ పండుగను ‘అఖా తీజ్’ అని కూడా పిలుస్తారు. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే జపం, దానం లేదా కొనుగోలు చేసే బంగారం శాశ్వతంగా వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానమని భావిస్తారు.
బంగారం కొనుగోలు సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 తెల్లవారుజామున 05:51 వరకు బంగారం కొనడానికి అత్యంత అనుకూలమైన సమయం.
ఇది కూడా చదవండి: Financial Alerts: ఒక్క పొరపాటుతో లక్షలు నష్టపోవచ్చు.. ఏప్రిల్ 5వ తేదీలోగా ఇది చేయండి!
పూజ: ఉదయం పవిత్ర స్నానం ఆచరించి, మహాలక్ష్మి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ఇతర లోహపు వస్తువులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
గమనిక: ఈ సమాచారం ప్రజల విశ్వాసాలు, దృక్ పంచాంగ్ ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ పురోహితులను సంప్రదించగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి