Whatsapp: ఈ ఒక్క మెస్సేజ్‌తో వాట్సప్‌లోనే అన్ని సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. నెంబర్ చేసి పెట్టుకోండి..

టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఏ పని అయినా మొబైల్ ద్వారానే సులువుగా పూర్తవుతుంది. ఒక్క మొబైల్ మన చేతుల్లో ఉంటే చాలు... నిమిషాల్లోనే పనులన్నీ పూర్తవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వ సేవల్లో వేగం పెరుగుతోంది.

Whatsapp: ఈ ఒక్క మెస్సేజ్‌తో వాట్సప్‌లోనే అన్ని సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. నెంబర్ చేసి పెట్టుకోండి..
Whatsapp

Updated on: Jul 10, 2026 | 8:43 PM

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సప్. పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాట్సప్ ఒక్కసారైనా ఓపెన్ చేస్తారు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో చాట్ చేయడానికి లేదా ఆఫీస్ వర్క్, వ్యాపార అవసరాల కోసం వాట్సప్ వాడుతూ ఉంటారు. కొంతమంది నిరంతరం వాట్సప్‌లోనే ఉంటూ ఉంటారు. ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా ప్రభుత్వాలు కూడా ప్రజలకు సులువుగా సేవలు అందించేందుకు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలు వాట్సప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ సేవల ద్వారా ప్రజలు వాట్సప్‌లోనే అన్ని పత్రాలను పొందటంతో పాటు ఇరత సేవలు పొందవచ్చు.

గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

కేంద్ర ప్రభుత్వం వాట్సప్ ద్వారా ప్రజలు సులభంగా గుర్తింపు ధృవీకరణ పత్రాలు, మార్క్ షీట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా మైగవ్ హెల్ప్ డెస్క్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పీడీఎఫ్ ఫార్మట్‌లో పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం 9013151515 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని ‘Hi’ అని మెస్సేజ్ పంపాలి. అనంతరం పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్, ఇంటర్ సర్టిఫికేట్లు పొందవచ్చు.

వాట్సప్ చేస్తే నిమిషాల్లోనే ఫుడ్

రైల్వే ప్రయాణికులకు ట్రైన్లో ఫుడ్ అందించేందుకు ఇండియన్ రైల్వే, జియోమార్ట్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం వాట్సప్ నెంబర్లను తీసుకొచ్చాయి. 70420 62070 నంబర్‌కు ‘Hi’ అని మెస్సేజ్ చేసి ప్రయాణికులు తమ PNR నంబర్‌ను పంపాలి. దీంతో ఫుడ్ మీ బెర్త్ దగ్గరికి వస్తుంది. ఇక ప్రయాణ సమయంలో కిరాణా సామాగ్రి లేదా ఇతర ఆహార పదార్థాలను నేరుగా సీటు దగ్గరకే ఆర్డర్ చేయడానికి 8881199119 నెంబర్‌కు వాట్సప్ చేయాలి.

బ్యాంక్ సేవలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90226 90226 వాట్సప్ నెంబర్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ , పెన్షన్ స్లిప్‌ను పొందవచ్చు. ఇక ICICI బ్యాంక్ 86400 86400 నెంబర్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్, కార్డు బ్లాక్/అన్‌బ్లాక్ , ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు పొందవచ్చు.

గ్యాస్ సిలిండర్ బుకింగ్

ఇండనే గ్యాస్, 75888 88824, హెచ్‌పి గ్యాస్, 92222 01122, భారత్ గ్యాస్ 18002 24344 నెంబర్ల ద్వారా గ్యాస్ సిలిండర్లు మొబైల్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు

Follow Us