
ఇప్పటివరకు వాట్సప్ అంటే కేవలం ఛాటింగ్ చేసుకోవడం, ఫైల్స్, వీడియోలు పంపించుకోవడమే కాదు.. ఇక నుంచి మీరు ఇదే సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో యుటిలిటీ బిల్లలను కూడా చెల్లించవచ్చు. ఇప్పటికే వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులో ఉండగా.. ఇక నుంచి కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులు లాంటివి కూడా సలువుగా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు చెల్లించడం లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు వాట్సప్ తాజాగా బిల్లుల చెల్లింపు సేవలను ప్రారంభించింది. దీని వల్ల తమ రోజువారీ యుటిలిటీ బిల్లులను వాట్సప్‌లో చెల్లించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వేరే యాప్ ఓపెన్ చేయాల్సి అవసరం ఉండదు. దీంతో యుటిలిటీ బిల్లుల చెల్లింపు ప్రక్రియ అనేది మరింత సులభతరం అవుతుంది. భారత్‌లోని వాట్సప్ వినియోగదారులకు దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నెట్ వర్క్ ద్వారా ఇది పనిచేస్తుంది. విద్యుత్, గ్యాస్, ఫాస్టాగ్ రీఛార్జ్, బీమా ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు, లోన్ ఈఎంఐల చెల్లింపు, వాటర్ బిల్లు లాంటి 30 వర్గాల్లోని 22,722 బిల్లుదారులకు ఇది మద్దతు ఇస్తోంది.
-మీ ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి
-పై భాగంలో ఉండే రూపీ ఐకాన్‌పై క్లిక్ చేయండి
-అనంతరం బిల్లుల చెల్లింపు ఆప్షన్ ఎంచుకోవాలి
-మీరు ఏ బిల్లు చెల్లించాలనేది ఎంచుకోవాలి
-అనంతరం బిల్లు నెంబర్ ఎంటర్ చేయాలి
-యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి
బ్యాంక్ అకౌంట్ ద్వారానే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. ఇప్పటికే వాట్సప్‌లో మెట్రో టికెట్లను బక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు యుటిలిటీ బిల్లులు కూడా సులువుగా చెల్లించవచ్చు. వేరే యాప్ అవసరం లేకుండా వాట్సప్‌లోనే సులువుగా బిల్లులు చెల్లించవచ్చు. డిజిటల్ చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే గతంలో చెల్లించిన బిల్లులతో పాటు రాబోయే బిల్లులను కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. దేశంలో 60 కోట్లకుపైగా వాట్సప్ వినియోగదారులు ఉన్నారు. దీంతో వాట్సప్‌కు పెద్ద మార్కెట్‌గా భారత్ ఉంది. వాట్సప్‌లో ఇప్పటికే పేమెంట్స్ సౌకర్యం ఉండగా.. దీనిని చాలామంది ఉపయోగిస్తున్నారు. దీంతో బిల్లుల చెల్లింపు వ్యవస్థను కూడా వాాట్సప్ ప్రవేశపెట్టింది.
ప్రశ్న: వాట్సప్‌లో బిల్లుల చెల్లింపు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది
జవాబు: వాట్సప్ ఓపెన్ చేశాక పైభాగంలో రూపీ సింబల్‌పైన క్లిక్ చేస్తే సరిపోతుంది
ప్రశ్న: డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయవచ్చా..?
జవాబు: అవును. యూపీఐ ద్వారా కూడా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు
ప్రశ్న: పేమెంట్ చేయడం ఎలా.??
జవాబు: రూపీ సింబర్ ఐకాన్‌పై క్లిక్ చేశాక బిల్లుల చెల్లింపు ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది