Water Bottle: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ రేట్లు.. ఎంతో తెలుసా..?

వేసవి ఎండలకు ముందే సామాన్య ప్రజల జేబుకు చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది. అవును అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇప్పటికే దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో కొన్ని దగ్గర గ్యాస్ ధరలు పెరిగిపోయాయ్. రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు కూడా పెరగనున్నట్టు తెలుస్తోంది. అయితే వీటితో పాలు వాటర్ బాటిల్స్ ధరలు కూడా పెరగనున్నట్టు తాజాగా రాయిటర్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం తెలుస్తోంది. యుద్ధానికి వాటర్ బాటిల్ ధరల పెరుగుదలకు కారణం ఏంటని అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

Water Bottle: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ రేట్లు.. ఎంతో తెలుసా..?
Water Bottle Price Hike India

Updated on: Mar 13, 2026 | 8:11 PM

భారతదేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడనున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయని రాయిటర్స్ పేర్కొంది. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మనదేశంలోని సుమారు 5 బిలియన్ల డాలర్ల విలువైన వాటర్ బాటిల్ మార్కెట్ తీవ్ర ఇబ్బందులకు లోనవుతోందని తెలుస్తోంది. రాబోయే వేసవి నేపథ్యంలో ఈ పరిణామాలు జనాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో ఏర్పడన అంతరాయాలతో ప్లాస్టిక్ బాటిళ్లు, మూతలు, లేబుల్స్, కార్డ్‌బోర్డ్ బాక్సుల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. దీనివల్ల సుమారు 2,000 వరకు చిన్న తరహా తయారీదారులు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే బాటిల్ ధరను 1 రూపాయి మేర పెంచారు. రాబోయే రోజుల్లో ఇది మరో 10శాతం పెరిగే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.

చమురు కొరత నేపథ్యంలో పెట్రోలియం ధరలు పెరగడంతో ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిమర్ ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీకి పాలిమర్ రూ.170 కి చేరింది. అంటే గతంలో కన్నా ఇది 50శాతం పెరిగినట్టు తెలుస్తోంది.దీంతో బాటిల్ మూతల ధర కూడా పెరిగి 0.45 పైసలకు చేరుకుంది. అయితే బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక లీటర్ బాటిల్‌ను రూ.20కు విక్రయిస్తున్నారు. కానీ తయారీ ఖర్చులు పెరగడంతో రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే మన దేశంలోని సుమారు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమైన కారణంగా దేశంలో ఉన్న సుమారు 140 కోట్ల మంది ప్రజలు వాటర్ బాటిల్ నీటినే తాగుతున్నారు. కాబట్టి మన దేశంలో వాటర్ అనేది విలాసం కాదని.. ఒక అవసరంగా మారిందని చెబుతున్నారు. బిస్లేరి, కిన్లే, ఆక్వాఫినా వంటి దిగ్గజ సంస్థలు ఈ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద కంపెనీలు ధరల భారాన్ని భరిస్తున్నప్పటికీ, చిన్న కంపెనీలు మాత్రం ధరలు పెంచక తప్పని పరిస్థితిలో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసంఇ ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us