Vivo Smart Phone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo తన కొత్త ఫోన్‌ని విడుదల చేసింది. దీనికి Vivo V23e అని పేరు పెట్టారు. Vivo V23 సిరీస్‌లో ఇది మొదటి ఫోన్. ఈ మొబైల్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది. దీనితో పాటు MediaTek ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. Vivo V23e స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఇది 6.44 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ఈ Vivo స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ Helio G96 చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ఇది వినియోగదారులకు మెరుగైన వేగాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. కంపెనీ ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. ఇది 4050 mAh బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇందులో టైప్ సి పోర్ట్ కూడా ఉంది. ఈ Vivo స్మార్ట్‌ఫోన్ Android 11 ఆధారిత Funtouch OS 12లో పనిచేస్తుంది. దీని కారణంగా వినియోగదారులు అనేక మంచి ఫీచర్లను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో SD కార్డ్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది.
ivo V23e నాచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇది సెల్ఫీ కెమెరా వీడియో కాలింగ్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్స్ అంతేకాకుండా 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ఇది 115-డిగ్రీల వీక్షణను క్యాప్చర్ చేయగలదు. ఇందులోని మూడో కెమెరా 2 మెగాపిక్సెల్. ఈ Vivo స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో విడుదల చేశారు. దీని ధర VND 8,490,000 ( భారతీయ కరెన్సీలో సుమారు రూ. 27,761). ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. వీటికి మూన్‌లైట్ షాడో, మెలోడీ డాన్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌తో సహా ఇతర దేశాలలో విడుదల కానుంది.