Vande Bharat: వందేభారత్‌ రైలులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..

|

Jul 03, 2024 | 9:11 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలతోపాటు కొత్త కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది వందేభారత్‌ రైళ్లను..

Vande Bharat: వందేభారత్‌ రైలులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
Vande Bharat
Follow us on

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలతోపాటు కొత్త కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది వందేభారత్‌ రైళ్లను పెంచుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల నుంచి ఈ వందేభారత్‌పై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. టిక్కెట్‌ ధర ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ వందేభారత్‌ను ఎంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా వందేభారత్‌ పైకప్పు నుంచి లోనికి నీరు చేరింది. ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ వందేభారత్‌ రైలులో ఈ ఘటన చోటు చేసుకొంది.

 

ఇవి కూడా చదవండి


ఇటీవల వారణాసికి బయలుదేరిన వందేభారత్‌లో వర్షం కారణంగా పైకప్పు నుంచి నీరు లోనికి చేరింది. సీట్లన్నీ తడిచిపోవడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఏకధాటిగా నీరు పైనుంచి రావడంతో ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ప్రయాణికుడు రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి స్పందన పెరిగింది. ‘వందేభారత్‌లో ఇది వరకు క్యాటరింగ్‌ సమస్య ఉండేదని.. ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొవాలని కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ వందేభారత్‌లో వచ్చిన నీరుపై నార్త్‌ రైల్వే స్పందించింది. నీరు రైలులోకి రావడానికి గల కారణాలను వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఏర్పాటు చేసిన నీటి పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తూ క్షమాపణలు చెప్పింది.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి