Vehicle Insurance: వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని అధికారులు పదేపదే చెబుతుంటారు. ఈ రోజుల్లో వాహన ఇన్సూరెన్స్ లేని కార్లు, ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. అందువల్ల చాలా మంది ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా చేసుకుంటారు. వివిధ సంస్థలు ఆన్‌లైన్‌లోనే సులభంగా ఇన్సూరెన్స్ పాలసీలను నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత సంబంధిత వాహనానికి ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి వస్తుంది. కానీ ఆన్‌లైన్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు దానికి సంబంధించిన లాభ నష్టాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటిపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ వెహికిల్ ఇన్నూరెన్స్ తీసుకోవడం వల్ల లాభాలు ఆన్‌లైన్‌లో సులభంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో మాదిరిగానే వివిధ రకాల ఫామ్‌లను నింపడం, ఎన్నో రకాల డాక్యుమెంట్లను సేకరించడం వంటి ఇబ్బందులు ఉండవు. అవసరమైతే కొన్ని డాక్యుమెంట్ల సాయంతో ఆన్‌లైన్‌లోనే కంపెనీలు పాలసీని నిర్ణయిస్తాయి. ఖాళీ సమయాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కంపెనీ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. అయితే ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసేవారు ఎక్కువ సమయాన్ని ఇందుకు కేటాయించాల్సిన అవసరం లేదు. మొత్తం కొనుగోలు ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా పాలసీని కొనుగోలు చేయవచ్చు. కానీ ఆఫ్ లైన్ విధానంలో ఇందుకు ఎక్కువ సమయం పడుతుంది. కస్టమర్లు ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.
వివిధ కంపెనీలు ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి బెనిఫిట్స్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా పోల్చి చూడవచ్చు. కంపెనీల వెబ్‌సైట్‌ల ద్వారా ఇందుకు
అవసమైన సమాచారాన్ని సేకరించవచ్చు. ఏజెంట్లు, కంపెనీ ప్రతినిధుల ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం ప్రకారం పాలసీలను ఎంచుకోవచ్చు. అవసరమైతే కార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ల సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అయితే వివిధ కంపెనీల బ్రాంచులకు వెళ్లి పాలసీల గురించి ఆరా తీయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే ఆన్‌లైన్‌లో వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకునేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే పని చేస్తాయి. అందుకే కంపెనీలకు ఆపరేషనల్ ఖర్చుల భారం తగ్గుతుంది. కంపెనీలు కస్టమర్లపై విధించే ఛార్జీల భారం చాలా తగ్గుతుంది.
ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకునేటప్పుడు వెబ్‌సైట్‌లో కంపెనీలు అడిగే కొన్ని ప్రశ్నల వల్ల కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంత మంది తప్పుడు సమాధానాలతో పాలసీ తీసుకుంటారు. దీని వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని కంపెనీలు క్లెయిమ్‌ను రద్దు చేస్తాయి. అయితే ఆన్‌లైన్‌లో పాలసీలను తీసుకునేవారు మోసపూరిత కంపెనీలు, థర్డ్
పార్టీ వెబ్‌సైట్ ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్ సాయంతో కస్టమర్లను సులభంగా మోసం
చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌లను కస్టమర్లు దూరంగా ఉంటే మంచిది.
ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్ సంస్థలకు ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్ యంత్రాంగం లేదు. అందువల్ల ఆన్‌లైన్‌లో పాలసీని ఎంచుకునేవారికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫైల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సేవల కోసం పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిధులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో ఏజెంట్లు కస్టమర్లకు అన్ని విధాలుగా సాయం చేస్తారు.
ఇవీ చదవండి: Telangana: తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Credit Card Limit: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కార్డు లిమిట్ పెంచుకుంటే లాభమా… నష్టమా..?