
ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రానికి తొలి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా అనేక వందే భారత్ రైళ్లు నడస్తోండగా.. వీటిల్లో ఆక్యూపెన్సీ కూడా ఫుల్‌గా ఉంది. దీంతో ఈ ప్రీమియం హైస్పీడ్ రైళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్లీపర్ వెర్షన్‌ను కూడా ఏపీ మీదుగా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ రైలుకు రైల్వే బోర్డు అధికారికంగా ఆమోదం తెలపగా.. మొత్తానికి ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. దసరా, దీపావళి వరుస పండుగల కారణంగా ఈ నెలలోనే దీనిని ప్రారంభించేందుకు రైల్వేశాక సిద్దమైనట్లు తెలుస్తోంది. వారానికి ఆరు రోజుల పాటు ఇది సర్వీసులు అందించనుంది. ఏపీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి వందే భారత్ స్లీపర్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది.
బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది. ఈ నెలలోనే ఈ రైలు పట్టాలెక్కించనుండగా.. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఈ రైలుకు సంబంధించిన టైమింగ్స్, స్టాపుల వివరాలు కూడా బయటకొచ్చాయి. బెంగళూరులో బయల్దేరనున్న ఈ రైలు.. ఏపీ మీదుగా ముంబైకి చేరుకుంటుంది. ఏపీలోని అనంతపురం, గుంతకల్‌లో ఈ ట్రైన్ ఆగుతుంది. వారంలో ఆరు రోజుల పాటు ఈ సర్వీస్ తిప్పనుండగా.. నిర్వహణ కోసం ఒక రోజు అందుబాటులో ఉండదు. బెంగళూరు-ముంబై మధ్య సర్వీస్ సోమవారాలు మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ముంబై-బెంగళూరు రైలు బంగళవారాలు మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలు టైమింగ్స్ విషయానికొస్తే.. బెంగళూరు-ముంబై సర్వీస్ రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ సర్వీసుల కోసం రెండు వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను ఉపయోగించనున్నారు. అనంతపురం, రాయచూర్, గుంతకల్, కలబురిగి, సోలాపూర్, పూణె, కళ్యాణ్ స్టేషన్లలో ఇది అగనుంది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ ఉండగా.. ఇందులో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైలు రాకతో ప్రయాణ సమయం 16 గంటలకు తగ్గనుంది. దీని రాకతో ముంబై, బెంగళూరు మధ్య రాత్రిపూట ప్రయాణం సౌకర్యవంతం కానుంది. ఇందులో సీసీటీవీ కెమెరాలు, టికెట్‌తో పాటు ఫుడ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, ఛార్జింగ్ పాయింట్లు, స్వదేశీ కవచ్ వంటి సౌకర్యాలు ఉంటాయి,.