Bank Account: మీకు తెలియకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయా..? ఈ ఒక్క ఆప్షన్ ఆఫ్ చేస్తే చాలు..

మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయా.. అయితే ఆటో పేమెంట్ వల్ల కావొచ్చు. ఓటీసీ సబ్‌స్క్రిప్షన్లు తీసున్నాక ఆటో మాండేట్ డిసేబుల్ చేయడం మర్చిపోతారు. దీని వల్ల అకౌంట్ నుంచి ప్రతీ నెలా డబ్బులు కట్ అవుతూ ఉంటాయి.

Bank Account: మీకు తెలియకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయా..? ఈ ఒక్క ఆప్షన్ ఆఫ్ చేస్తే చాలు..
Auto Debit

Updated on: Jul 03, 2026 | 6:00 PM

స్మార్ట్‌ఫోన్ ప్రతీఒక్కరి చేతుల్లో ఉండటంతో యూపీఐ యాప్స్ తెగ వాడేస్తున్నారు. రూ.10 లాంటి చిన్న లావాదేవీలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దీంతో దేశంలో యూపీఐ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. ఇక యూపీఐ యాప్స్ ద్వారా ఆటో మాండేట్ ఆప్షన్ చాలామంది ఎనేబుల్ చేసుకుంటారు. ఓటీపీ ప్లాట్‌ఫారమ్‌లు, హెల్త్, ఎడ్యుకేషన్, ఇతర డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లకు వారం లేదా నెల రోజుల పాటు ఉచిత ట్రయల్స్ అందిస్తారు. ఉచిత ట్రయల్స్ తీసుకునే సమయంలో యూపీఐ ఆటోపే మాండేట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. కానీ ట్రయల్ ముగిసిన తర్వాత దానిని డిసేబుల్ చేయడం మర్చిపోతుంటారు. దీని వల్ల మీకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుండి నెలకు రూ.199, రూ.299, రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రిప్షన్లకు కట్ అవుతూ ఉంటుంది.

డిసేబుల్ చేయడం ఎలా..?

చాలామంది ఓటీపీ ప్లాట్‌ఫారమ్‌లు, మ్యూజిక్ యాప్‌లు, జిమ్‌లు లాంటి అనేక సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటారు. కానీ వాటిని ఉపయోగించడం నిలిపివేస్తారు. కానీ ఆటో మాండేట్ యాక్టివ్‌గా ఉంటే మీ అకౌంట్ నుంచి డబ్బు మీకు తెలియకుండా ఆటోమేటిక్‌గా కట్ అవుతూ ఉంటుంది. మీకు తెలియకుండా మీ అకౌంట్ నుండి డబ్బు కట్ అవుతుందనే అనుమానం వస్తే యాక్టివ్‌గా ఉన్న అన్ని యూపీఐ మాండేట్‌లను చెక్ చేయండి. NPCI UPI పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. మీకు యాక్టివ్‌గా ఉన్న అన్ని UPI మాండేట్‌లు అక్కడ కనిపిస్తాయి. అనవసరమైన వాటిని అక్కడే క్యాన్సిల్ చేయడం లేదా రద్దు చేయడం లాంటివి చేయవచ్చు. ఇక పోర్టల్ నుండి మాండేట్‌ను తొలగించే ఆప్షన్ అందుబాటులో లేకపోతే UPI యాప్‌లోని ఆటోపే లేదా మాండేట్ విభాగానికి వెళ్లడం ద్వారా కూడా దానిని డిసేబుల్ చేయవచ్చు.

 ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మీరు ఏదైనా యాప్‌లో ఉచిత ట్రయల్ ప్రారంభించే ముందు ఒకసారి నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి. అవసరం లేకపోతే ఆటోపేని అనుమతించవద్దు. మీ బ్యాంక్ అకౌంట్, యూపీఐ ఆదేశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మీరు పాత సబ్‌స్క్రిప్షన్‌లను ఏవీ ఉపయోగించకపోతే వెంటనే ఆటోపేని నిలిపివేయండి. చిన్న ఆటో డెబిట్‌లు కూడా దీర్ఘకాలంలో మీ వాలెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మీకు తెలియకుండా అకౌంట్ నుంచి నెలనెలా డబ్బులు కట్ అవ్వడం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. మీ సొమ్ము వృథా అవుతుంది. దీంతో బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు తెలియకుండా డబ్బులు కట్ అయితే జాగ్రత్త పడండి.

Follow Us