
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై సుంకాలను తగ్గించింది. విదేశాల నుంచి వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం 20 శాతంగా ఉండగా.. దీనిని 10 శాతానికి తగ్గించింది. సుంకం విధించదగిన అన్ని వస్తువులపై సుంకం రేటును తగ్గించింది.
సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటీమోనేట్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు బడ్జె్ట్ ప్రసంగంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి ఉపయోగించే విడి భాగాలపై సుంకాన్ని మినహాయించారు. బ్యాటరీ శక్తి నిల్వ కోసం ఉపయోగించే లిథియం అయాన్ తయారీ వస్తువులకు కూడా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎగుమతి కోసం సముద్ర ఆహారాలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే నిర్ధిష్ట ఇన్‌ఫుట్‌ల సుంకం రహిత దిగుమతులు పరిమిని పెంచాలని నిర్ణయించారు. ఎగుమతి టర్నోవల్ విలువలో ప్రస్తుతం 1 శాతం ఉండగా.. దీనిని 3 శాతానికి పెంచారు.
ఇక తోలు, సింథటిక్ పాదరక్షల ఎగుమతులకు కూడా దీనిని విస్తరించనున్నారు.
ఇక విమానాల తయారీకి ఉపయోగించే విడి భాగాలపై సుంకాన్ని మినహాయించాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. అలాగే విదేశీ విద్య, ఆరోగ్య ఖర్చులపై 5 శాతం నుంచి 2 శాతానికి టీసీఎస్‌ను తగ్గించారు. ఇక రూ.20 లక్షల కంటే తక్కువ విలువ గత ఆదాయంపై విదేశీ ఆస్తులను వెల్లడించకపోతే ఎటువంటి జరిమానా ఉండదు. కేవలం చిన్న నేరాలకు మాత్రం జరిమానా విధిస్తారు. ఇక మార్చి 31 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆటోమేటెడ్ ప్రక్రియను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక మోటార్ యాక్సిడెంట్ క్లెయిమస్‌పై టీడీఎస్‌ను తొలగించారు. అటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రమాద చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక వికలాంగులకు అవసరమైన పరికరాలు త్వరగా, నాణ్యంగా అందేలా ‘దివ్యాంగ్ సహారా యోజన’ పథకం ప్రవేశపెట్టారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి 1.5 లక్షల మందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అటు చిన్న వ్యాపారుల కోసం రూ. 10,000 కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల బిజినెస్ పెంచుకోవచ్చు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) లోన్లు సులభంగా దొరికేలా కొత్త పద్ధతిని బడ్జెట్‌లో తెస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.