భారత్‌కు మరో షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయిన డొనాల్డ్‌ ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!

అమెరికన్ రైతుల రక్షణ కోసం డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారతీయ బియ్యం, కెనడియన్ ఎరువులతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలు విధించే యోచనలో ఉంది. చౌకైన విదేశీ వస్తువులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికితోడు, ట్రంప్ ప్రభుత్వం రైతులకు 12 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది.

భారత్‌కు మరో షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయిన డొనాల్డ్‌ ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!
Donald

Updated on: Dec 09, 2025 | 6:15 AM

చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో కెనడియన్ ఎరువులు, భారతీయ బియ్యంతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను పరిగణనలోకి తీసుకోవడానికి తన పరిపాలన సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికన్ రైతులకు 12 బిలియన్‌ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఆవిష్కరించడానికి వైట్ హౌస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ట్రంప్, పలు దేశాలు తక్కువ ధరకు బియ్యాన్ని అమెరికన్ మార్కెట్‌లోకి వదులుతున్నాయనే వాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదిస్తూ, ట్రంప్ కఠినమైన వైఖరి తీసుకోవాలని రైతులు ఒత్తిడి చేశారు. దీంతో సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పినట్లు సమాచారం. అమెరికా ఉత్పత్తిని పెంచడానికి తీవ్రమైన సుంకాలు విధిస్తామని కూడా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

లూసియానాకు చెందిన కెన్నెడీ రైస్ మిల్ CEO మెరిల్ కెన్నెడీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. భారత్‌, థాయిలాండ్, చైనా సుంకాలు ఎదుర్కొనే లిస్ట్‌లో ముందు ఉన్నాయని, చైనా ఎగుమతులు ప్రధాన భూభాగానికి బదులుగా ప్యూర్టో రికోలోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. మేము సంవత్సరాలుగా ప్యూర్టో రికోకు బియ్యం రవాణా చేయలేదు అని కెన్నెడీ అన్నారు. దక్షిణాదిలో ఉన్న మేం నిజంగా ఇబ్బంది పడుతున్నాం అని ఆయన అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి