ముఖ్యంగా అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ తో నష్టం కలుగుతోంది. ఈ సమస్య నుంచి పరిష్కారానికి ట్రూ కాలర్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దాని పనితీరు, ఇతర వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నంబర్లను ఫోన్ లోని కాంట్రాక్టు జాబితాలో సేవ్ చేసుకుంటాం. వారి నుంచి కాల్ వస్తే ఫోన్ డిస్ ప్లేలో పేరు కనిపిస్తుంది. ఒక్కోసారి మనం సేవ్ చేయని (అన్ నోన్ నంబర్లు) నంబర్ల నుంచి కాల్స్ వస్తాయి. వాటిని రిసీవ్ చేసుకోవాలో, లేదో తెలియదు. ఆ సమయంలో మనం చాలా బిజీగా ఉండవచ్చు. కానీ ఫోన్ చేసిన వారు ఎవరో తెలియక కంగారు పడతాం. పని మానుకుని రిసీవ్ చేసుకుంటే అది మార్కెటింగ్ లేదా స్పామ్ కాల్ కావచ్చు. ఒక్కోసారి సైబర్ నేరగాళ్లు కూడా ఇలా చేసే అవకాశం ఉంది.
స్టార్ట్ ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ ఉండే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ లోన్ కాల్స్ వచ్చినా వారి వివరాలు డిస్ ప్లేలో కనిపిస్తాయి. అంటే ఆ నంబర్ ను మీరు సేవ్ చేసుకోనప్పటికీ ఫోన్ చేసిన వారి పేరు చూపుతుంది. ట్రూ కాలర్ అనేది కాలర్ గుర్తింపు యాప్. దీన్ని స్వీడన్ కు చెందిన ట్రూ సాఫ్ట్ వేర్ శాండినేవియా ఏబీ అనే కంపెనీ రూపొందించింది. ఈ యాప్ నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి పనిచేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి