ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని ఇటీవల TRAI టెలికాం కంపెనీలను ఆదేశించించిన విషయం తెలిసిందే. ఇదొక పెద్ద నిర్ణయం. వాణిజ్య సందేశాలు, ఓటీపీకి సంబంధించిన ట్రేస్బిలిటీ నియమాలను అమలు చేయడానికి ట్రాయ్ ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రూల్స్‌ను ట్రాయ్ అనేక సార్లు పొడిగించింది. TRAI OTP మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు అక్టోబర్ 31 వరకు సమయం ఉండేది. కానీ మరోసారి పొడిగింపు తర్వాత ఇప్పుడు నవంబర్ 31 వరకు మాత్రమే ఉంది. Jio, Airtel, Vi, BSNL డిమాండ్‌ను అనుసరించి, కంపెనీ తన గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు దాని గడువు నవంబర్‌లో ముగియబోతుంది. వాణిజ్య సందేశాలు, ఓటీపీ (OTP) మెసేజ్‌లను ట్రాక్ చేయడానికి టెలికాం కంపెనీలు ట్రేస్‌బిలిటీ నియమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. 17 రోజుల పాటు బంద్!
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీల డిసెంబర్ 1 నుండి ట్రేసబిలిటీ నియమాన్ని అమలు చేస్తే, OTP మెసేజ్ రావడానికి సమయం పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు బ్యాంకింగ్ లేదా రిజర్వేషన్ వంటి ఏదైనా పని చేస్తే, మీరు ఓటీపీ పొందడానికి సమయం పట్టవచ్చు. ట్రాయ్ అటువంటి చర్య తీసుకుంది. ఎందుకంటే అనేక సార్లు స్కామర్లు నకిలీ ఓటీపీ మెసేజ్‌లను పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అన్ని టెలికాం కంపెనీలకు కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది. కానీ నవంబర్ 31 తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తుందా? లేదా పొడిగింపు ఏమైనా ఉంటుందా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు ఉపశమనం.. బంగారం ధరలకు బ్రేకులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి