TRAI: ఎప్పుడైనా ఉదయాన్ని ప్రశాంతంగా పనిచేసుకోవాలని అనుకున్నప్పుడు స్పామ్ నంబర్ల నుంచి మీకు కాల్స్ వచ్చాయా. లోన్లు, రియల్ ఎస్టేట్, ఇతర సేవలకు సంబంధించి కాల్స్ మిమ్మల్ని విసిగించిన సంఘటనలు తప్పక ఎదురయ్యే ఉంటాయి. మెుబైల్ వినియోగదారుల సంఖ్యతో పాటు ఇలాంటి స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి కాల్ వచ్చినప్పుడు వారి పేరు మెుబైల్ స్కీన్ పై వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ట్రాయ్ మెుబైల్ ఆపరేటర్లకు సూచించింది. ఇప్పటి వరకు మన ఫోన్ లో సేవ్ చేసుకున్న వ్యక్తులు కాల్ చేసినప్పుడే వారి పేరు కాల్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇకపై తెలియని వ్యక్తులు, లేదా నంబర్ల నుంచి కాల్ వచ్చినా ఇలాగే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని టెలికాం రెగ్యులేటరీ ఆలోచిస్తోంది. రానున్న కాలంలో ఇది వాస్తవ రూపం దాల్చుతుందని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా అన్నారు.
ఎవరైనా మనకు తెలియని వ్యక్తి కాల్ చేస్తే వారి మెుబైల్ కనెక్షన్ తీసుకునేసమయంలో ఆపరేటర్ కు అందించిన కేవైసీ వివరాల్లోని పేరును కాల్ సమయంలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రాయ్ కి సంబంధించిన ఒక అధికారి వెల్లడించారు. ఇలాంటి స్పామ్ కాల్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాలర్ ID ఫీచర్ సమ్మతి-ఆధారిత, స్వచ్ఛంద ప్రోగ్రామ్‌గా ప్లాన్ చేయటం జరుగుతోంది. దీనిలో చందాదారులు తమ పేర్లను ప్రదర్శించాలా వద్దా అని ఎంచుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో కమ్యూనిటీ-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సర్వే చేసిన 9,623 మొబైల్ వినియోగదారుల్లో 64 శాతం మంది తమకు రోజుకు కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..