జపాన్‌కు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం టయోటా అగ్ని ప్రమాదం కారణంగా యుఎస్‌లో ఇటీవల తయారు చేసిన దాదాపు 1,68,000 వాహనాలను రీకాల్ చేసింది. రీకాల్‌లో నిర్దిష్ట 2022, 2023 మోడల్ టయోటా టండ్రా, టండ్రా హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మోడల్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వాహనాలను రీకాల్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యూబ్ విషయంలో వచ్చిన ఇబ్బంది కారణంగానే కంపెనీ ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్లు ప్రస్తుతం యూఎస్ మాత్రమే రీకాల్ చేశారు. యూఎస్‌లో ప్రస్తుతం 1.68 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్ల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? రీకాల్ సమయంలో కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
టయోటా టండ్రా కార్లు ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యూబ్‌తో అమర్చి ఉంటాయి, ఇవి బ్రేక్ లైన్‌కు వ్యతిరేకంగా కదులుతాయి. అందువల్ల ఇంధనం లీకయ్యే అవకాశం అధికంగా ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇంధనం లీక్ అయితే అగ్ని ప్రమాదం జరగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కార్లను ప్రస్తుతం టయోటా డీలర్లు ఇంధన ట్యూబ్‌ను మెరుగైన భాగంతో భర్తీ చేస్తారు. అలాగే వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అదనపు క్లాంప్‌లను అందిస్తారు. ప్రస్తుతం ఈ రీకాల్ కోసం నివారణ భాగాలను సిద్ధం చేస్తున్నట్లు టయోటా ప్రతినిధులు పేర్కొంటున్నారు. తుది రెమెడీ భాగాలు అందుబాటులోకి వచ్చే వరకు కస్టమర్లు రక్షిత పదార్థాలను అందించడంతో ఇంధన ట్యూబ్‌పై బిగింపును తాత్కాలికంగా చేస్తారు. నివారణా బాగాలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక అక్టోబర్ 2023 నాటికి అన్ని కార్లను అధునాతనంగా తీర్చిదిద్దుతామని మేకర్లు పేర్కొంటున్నారు.
గత సంవత్సరం, టయోటాతో సహా ఎనిమిది ఆటోమేకర్లు లోపభూయిష్ట భాగాలను సరిచేయడానికి 1,00,000 కంటే ఎక్కువ వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేశౠరని గణాంకాలు చెబుతున్నాయి. టయోటా, కియా, ఫోర్డ్ సేల్స్ అండ్ సర్వీస్ కొరియా, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కొరియా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొరియా, బీఎమ్‌డబ్ల్యూ కొరియా, దాసన్ హెవీ ఇండస్ట్రీస్ కో, మోటోస్టార్ కొరియా అనే ఎనిమిది సంస్థలు మొత్తం 52 రకాల మోడళ్లలో 1,02,169 యూనిట్లను రీకాల్ చేశాయి.