Business Idea: లో ఇన్వెస్ట్‌మెంట్.. హై ఫ్రాఫిట్.. మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని 5 బిజినెస్‌లు ఇవే!

ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాల వైపు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కాలమిది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం వచ్చే తయారీ రంగం వ్యాపారాలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. రోజువారీ వినియోగ వస్తువులు, ఈ-కామర్స్ విస్తరణ, ఫుడ్ డెలివరీ సేవలు, నిర్మాణ రంగం అభివృద్ధి వంటి అంశాలు ఈ వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. సరైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ ఉంటే ఈ బిజినెస్‌ల ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

Business Idea: లో ఇన్వెస్ట్‌మెంట్.. హై ఫ్రాఫిట్.. మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని 5 బిజినెస్‌లు ఇవే!
Low Investment Businesses

Edited By:

Updated on: Jun 30, 2026 | 9:53 PM

తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారాల్లో ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ ఒకటి. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లు, ఈ-కామర్స్ కంపెనీల అవసరాల వల్ల ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సుమారు రూ.2 నుంచి రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మార్కెట్‌ను బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇళ్లలో, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల్లో విస్తృతంగా వినియోగించే క్లీనింగ్ ఉత్పత్తుల తయారీ కూడా మంచి అవకాశాలను కల్పిస్తోంది. ఫ్లోర్ క్లీనర్లు, డిటర్జెంట్లు, డిస్ఇన్‌ఫెక్టెంట్లు వంటి ఉత్పత్తులకు ప్రతి రోజూ అవసరం ఉండటంతో ఈ రంగంలో డిమాండ్ స్థిరంగా ఉంటుంది. సుమారు రూ.2 నుంచి రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది.

కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీ బిజినెస్

నిర్మాణ రంగం నిరంతరం విస్తరిస్తుండటంతో కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీ కూడా లాభదాయక వ్యాపారంగా మారుతోంది. ఇంటి నిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల నిర్మాణం కొనసాగుతున్నంతకాలం ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుంది. రూ.5 నుంచి రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ.1 లక్షకు పైగా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఫుడ్‌ ప్రాసెసలింగ్ బిజినెస్!

ఆహార ఉత్పత్తుల తయారీ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రతి రోజు వినియోగించే ఆహార పదార్థాలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. నాణ్యమైన ఉత్పత్తులు, సరైన బ్రాండింగ్ ఉంటే ఈ రంగంలో వేగంగా ఎదిగే అవకాశం ఉంది. రూ.3 నుంచి రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించి మార్కెట్‌ను బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

డిస్పోజబుల్ ఉత్పత్తుల తయారీ!

ఇక డిస్పోజబుల్ ఉత్పత్తుల తయారీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. హోటళ్లు, ఆసుపత్రులు, కార్యాలయాలు, ఫుడ్ సర్వీస్ రంగంలో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. రోజువారీ అవసరమైన ఉత్పత్తులు కావడంతో మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రూ.3 నుంచి రూ.8 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి!

అయితే ఏ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు స్థానిక మార్కెట్ అవసరాలు, ముడి సరుకు లభ్యత, లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్ వ్యూహం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే చిన్న పెట్టుబడితోనే దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us