Business Ideas: లక్షలు లక్షలు సంపాదించే అవకాశం.. ఇలా సాగు చేస్తే మరిన్ని లాభాలు..

Tomato Farming: ఈ మధ్యకాలంలో ట్రెండిగ్‌లో ఉన్న పదం టమాటో.. దేశం మొత్తం ఈ పండు గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే టమాటో ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు దానిని సాగు చేయడం ద్వారా చాలా లాభం పొందవచ్చు. వాస్తవానికి.. మనం టమోటా సాగు గురించి మాట్లాడుతున్నాం.

Business Ideas: లక్షలు లక్షలు సంపాదించే అవకాశం.. ఇలా సాగు చేస్తే మరిన్ని లాభాలు..
Tomato Farming

Updated on: Jul 21, 2023 | 2:24 PM

మంచి బిజినెస్ ఆలోచించేవారికి ఇదో అద్భుతమై ఐడియా.. మీరు ఎదుగుతూ పదిమందికి ఉపాధికల్పించవచ్చు. దీంతోపాటు ఆదర్శవంతమైన జీవితాన్ని మొదలుపెట్టవచ్చు. వ్యవసాయంను కూడా బిజినెస్‌లా మొదలు పెట్టవచ్చు. ఏంటి వ్యవసాయం బిజినెస ఏంటని ఆలోచిస్తున్నారా.. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఎందుకంటే మన వ్యవసాయ క్షేత్రంలో ఒకరు, ఇద్దరితోనే ముగియదు.. చాలా మంది పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మనం గొప్ప వ్యాపార ఆలోచన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో ట్రెండిగ్‌లో ఉన్న పదం టమాటో.. దేశం మొత్తం ఈ పండు గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే టమాటో ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు దానిని సాగు చేయడం ద్వారా చాలా లాభం పొందవచ్చు. వాస్తవానికి.. మనం టమోటా సాగు గురించి మాట్లాడుతున్నాం.

నగరం నుంచి గ్రామం వరకు ఎక్కడ చూసినా టమాటోకు విపరీతమైన గిరాకీ ఉంది. వ్యవసాయం సక్రమంగా చేస్తే మంచి ఆదాయం వస్తుంది. మీరు నగదు పంట టమోటాను పండించడం ద్వారా బంపర్ సంపాదించవచ్చు. భారతదేశంలో టమోటాను పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఒక హెక్టారులో 800-1200 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి చేయవచ్చు. వివిధ రకాలను బట్టి ఉత్పత్తి మారుతుంది.

టమోటా వ్యవసాయం ఎలా చేయాలి?

టమోటా సాగు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. ఒకటి జూలై-ఆగస్టు నుంచి మొదలై ఫిబ్రవరి-మార్చి వరకు ఉంటుంది. మరోసారి నవంబర్-డిసెంబర్ నుంచి మొదలై జూన్-జూలై వరకు నడుస్తుంది. అదే సమయంలో, ఒక హెక్టారు భూమిలో సుమారు 15,000 మొక్కలు నాటవచ్చు. పొలాల్లో మొక్కలు నాటిన 2-3 నెలల తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.

ఆకాశాన్ని తాకుతున్న టమాటా ధరలు..

కొన్నిసార్లు టమాటా దిగుబడి తగ్గుతుంది.. ఆ సమయంలో మార్కెట్‌లో టమాటోకు భారీగా డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఆదే సమయంలో ధర ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో 300 నుంచి రూ.120 వరకు చేరింది. అయితే త్వరలో ధర తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం టమాట విక్రయాలను ప్రారంభించగా, అందులో కిలో రూ.70 చొప్పున టమాట విక్రయిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం